https://oktelugu.com/

బన్నీని ఢీకొట్టడానికి వస్తున్న బాలీవుడ్ నటుడు..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్-అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ‘పుష్ప’ రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లలో ఆర్య.. ఆర్య-2చిత్రాలు గతంలోనే వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో అభిమానులు ‘పుష్ప’ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతోంది. కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడగా త్వరలోనే ప్రారంభించేందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 04:05 PM IST
    Follow us on

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్-అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ‘పుష్ప’ రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లలో ఆర్య.. ఆర్య-2చిత్రాలు గతంలోనే వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో అభిమానులు ‘పుష్ప’ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతోంది. కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడగా త్వరలోనే ప్రారంభించేందుకు దర్శకుడు సుకుమార్ సన్నహాలు చేస్తున్నాడు. ఈ నెలలోనే మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈమేరకు తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ఏజెన్సీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్‌ను వేశారు.

    Also Read: ఫీల్ అయిన శేఖర్ కమ్ముల.. మధ్యలోనే లేచి.. !

    ‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కన్పించబోతుండగా అతడికి జోడీగా రష్మిక మందన్న నటించనుంది. ఈ మూవీలో విలన్ గా మొదటి విజయ్ సేతుపతి ఖరారయ్యాడు. అయితే అనివార్య కారణాలతో విజయ్ సేతుపతి మూవీ నుంచి తప్పుకోగా అతడి స్థానంలో ఎవరు నటిస్తారనేది ఇంత వరకు ఖరారు కాలేదు. కన్నడ చిత్రసీమకు చెందిన ఉపేంద్ర, సుదీప్ పేర్లు తెరపైకి వచ్చాయి.

    తాజా సమాచారం ‘పుష్ప’ మూవీలో బాలీవుడ్ నటుడు విలన్ గా తీసుకోనున్నారనే టాక్ విన్పిస్తోంది. ‘పుష్ప’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తుండటంతో విలన్ గా బాలీవుడ్ నటుడైతే బాగుంటుందని చిత్రయూనిట్ భావిస్తుందట. ఈమేరకు పలువురు బాలీవుడ్ నటులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

    Also Read: బిగ్ బాస్-4: కంటెస్టెంట్ల పారితోషికాలు లీక్.. అత్యధికంగా ఎవరికంటే?

    త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. దీంతో బన్నీని ఢీకొట్టే బాలీవుడ్ నటుడు ఎవరా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.  ఈ మూవీలో జగపతి బాబు.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి క్రియేషన్స్  ఆ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.