Pushpa Teaser: దీపావళికి పేలనున్న ‘పుష్ప’ బాంబ్.. బొమ్మ దద్దరల్లిపోద్దట!

Pushpa Teaser: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, రష్మిక మందన్నలను మునుపెన్నడూ చూడని అవతారాల్లో చూపించి ‘పుష్ప’కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చాడు దర్శకుడు సుకుమార్. దీపావళి పండుగకు బన్నీ అభిమానులకు మరో పెద్ద గిఫ్ట్ రెడీ చేశాడట.. ఈ మేరకు నిర్మాతలు ప్లాన్ చేసినట్టు తెలిసింది. దీపావళికి పవర్ ప్యాక్డ్ టీజర్ ను లాంచ్ చేసేందుకు పుష్ప టీం రెడీ అవుతోందట.. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ‘పుష్ప-ది రైజ్’ టీజర్ ను మేకర్స్ విడుదల చేయనున్నారు. […]

Written By: NARESH, Updated On : November 1, 2021 4:17 pm
Follow us on

Pushpa Teaser: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, రష్మిక మందన్నలను మునుపెన్నడూ చూడని అవతారాల్లో చూపించి ‘పుష్ప’కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చాడు దర్శకుడు సుకుమార్. దీపావళి పండుగకు బన్నీ అభిమానులకు మరో పెద్ద గిఫ్ట్ రెడీ చేశాడట.. ఈ మేరకు నిర్మాతలు ప్లాన్ చేసినట్టు తెలిసింది. దీపావళికి పవర్ ప్యాక్డ్ టీజర్ ను లాంచ్ చేసేందుకు పుష్ప టీం రెడీ అవుతోందట..

pushpa teaser

దీపావళి సందర్భంగా నవంబర్ 4న ‘పుష్ప-ది రైజ్’ టీజర్ ను మేకర్స్ విడుదల చేయనున్నారు. టీజర్ పై అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకునే విధంగా మేకర్స్ ఈ టీజర్స్ ను కట్ చేసినట్లు సమాచారం.ఈ టీజర్ తో సినిమాపై మరింత హైప్ పెంచడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ‘పుష్ప’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని..త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని సమాచారం. ఈ భారీ మాస్ మసాలా మూవీని డిసెంబర్ 17న థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నందున ప్రమోషన్ లను కిక్ స్టార్ట్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా గంధపు చెక్కల స్మగ్లర్ జీవితం, అటవీ అధికారులు, పోలీసులతో అతడి ఘర్షణ ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు.ఈ సినిమా పూర్తి భాగం గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. అల్లు అర్జున్ ను ‘మాస్’ యాంగిల్ లో భీకరంగా చూపిస్తారట.. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ఒక విలన్ పోలీస్ గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.