https://oktelugu.com/

Nithya Menon: మళ్లీ ఫామ్​లోకి వచ్చిన ముద్దుగుమ్మ నిత్య మీనన్…

Nithya Menon : టాలీవుడ్​లో ప్రస్తుతం నిత్యమీనన్ హవా నడుస్తోంది. ఈ అమ్మడు వరుస స్టార్​ హిరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకపోతోంది నిత్య మీనన్… తెలుగులో అతి తక్కువ సమయంలో ఫుల్ ఫాలోయింగ్ అందుకున్న ముద్దుగుమ్మ.. అందం.. అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. సింగర్‏గానూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా… తమిళంలోనూ ఈ అమ్మడు ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలా మొదలైంది సినిమాతో నిత్య టాప్ హీరోయిన్ రేసులో […]

Written By: , Updated On : November 1, 2021 / 03:57 PM IST
Follow us on

Nithya Menon : టాలీవుడ్​లో ప్రస్తుతం నిత్యమీనన్ హవా నడుస్తోంది. ఈ అమ్మడు వరుస స్టార్​ హిరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకపోతోంది నిత్య మీనన్… తెలుగులో అతి తక్కువ సమయంలో ఫుల్ ఫాలోయింగ్ అందుకున్న ముద్దుగుమ్మ.. అందం.. అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. సింగర్‏గానూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా… తమిళంలోనూ ఈ అమ్మడు ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలా మొదలైంది సినిమాతో నిత్య టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోయింది.

dasara movie makers planning to take nithya menon for a guest role

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే నిత్య సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుంది. అనుకోకుండా చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటూ విరామ సమయాన్ని ఎంజాయ్ చేసింది. ఇదిలా ఉంటే.. చాలా కాలం గ్యాప్ తర్వాత నిత్య తెలుగులో మళ్లీ వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్‏గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట్లో రికార్డ్స్ సృష్టించాయి.

తాజాగా నిత్య మీనన్ క్రేజ్ ఆఫర్ వరించినట్లుగా తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న దసరా మూవీలో నిత్యను అతిథి పాత్ర కోసం ఎంపిక చేశారట మేకర్స్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నిత్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇందులో నాని సరనస కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన నేను లోకల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో నాని.. నిత్య మీనన్ కాంబోలో వచ్చిన అలా మొదలైంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.