https://oktelugu.com/

Pushpa in US: యూఎస్​లో డాలర్ల వర్షం కురిపిస్తోన్న పుష్పరాజ్​

Pushpa in US: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ “పుష్ప”.ఈ నెల 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదలైన రెండ్రోజుల్లోనే 100 కోట్ల క్లబ్​లో చేరి రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్​కు ఓ రేంజ్​లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. ఈ సినిమా ఒక్క ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్​లోనూ భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిపోతోంది. ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 24, 2021 / 12:21 PM IST
    Follow us on

    Pushpa in US: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ “పుష్ప”.ఈ నెల 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదలైన రెండ్రోజుల్లోనే 100 కోట్ల క్లబ్​లో చేరి రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్​కు ఓ రేంజ్​లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. ఈ సినిమా ఒక్క ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్​లోనూ భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిపోతోంది.

    Pushpa in US

    ఈ సినిమా ప్రీ సేల్స్​లో రికార్డు స్థాయిలో బుకింగ్స్​తో భారీ క్రేజ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్పరాజ్​ బాక్సాఫీసు వద్ద నిలబడి డాలర్ల వర్షం కురిపిస్తున్నాడు. యూఎస్​లో ఇప్పటి వరకు 2 మిలియన్ల డాలర్ల మార్క్ క్రాస్​ చేశారు ఐకాన్ స్టార్​. మరి ఇలాగే ఈ వారం కూడా థియేటర్​లో నిలుస్తాడా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది.

    Also Read: ఆంధ్రాలో పుష్ప చిత్రానికి భారీ దెబ్బ…!

    కాగా, ఈ సినిమా మొదట్లో కాస్త మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కలెక్షన్ల పరంగా ఎక్కడా వెనకడుగు వేయట్లేదని అర్థమవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రెండో భాగం షూటింగ్​ ఫిబ్రవరిలో మొదలుకానున్నట్లు ప్రకటించారు మేకర్స్​. మరోవైపు సుకుమార్ ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో తీయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రామ్​చరణ్​తో కూడా కలిసి ఓ సినిమా తీయనున్నారట. అయితే, ఇంకా చరణ్ కథ చర్చ దశలోనే ఉందని సమాచారం.  కాగా, ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో రామ్​చరణ్​ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్​చరణ్​తో పాటు తారక్ కూడా హీరోగా నటించారు. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Also Read: పుష్ప ది రైజ్​ కి అనసూయ పారితోషకం ఎంతో తెలుసా?