https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: సరికొత్త వర్షన్​తో బిగ్​బాస్​.. ఈ సారి ప్రసారం టీవీల్లో కాదట!

Bigg Boss Telugu OTT: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తోన్న హాట్​ రియాలిటీ గేమ్ షో బిగ్​బాస్​ సీజన్​ 5 ఎట్టకేలకు ముగిసింది. ఎవరు గెలుస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులు సన్నీ విజయంతో రిలాక్స్ అయ్యారు. తెలుగుతో పాటు, ఇండియన్ టెలివిజన్​ అన్ని ప్రధాన భాషల్లో ఈ షోకు మంచి క్రేజ్ ఉంది. కాగా, తెలుగులో సీజన్ 5 ముగిసిన నేపథ్యంలో..  నెక్స్ సీజన్ ఎప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 24, 2021 / 12:40 PM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తోన్న హాట్​ రియాలిటీ గేమ్ షో బిగ్​బాస్​ సీజన్​ 5 ఎట్టకేలకు ముగిసింది. ఎవరు గెలుస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులు సన్నీ విజయంతో రిలాక్స్ అయ్యారు. తెలుగుతో పాటు, ఇండియన్ టెలివిజన్​ అన్ని ప్రధాన భాషల్లో ఈ షోకు మంచి క్రేజ్ ఉంది. కాగా, తెలుగులో సీజన్ 5 ముగిసిన నేపథ్యంలో..  నెక్స్ సీజన్ ఎప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Bigg Boss Telugu OTT

    ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ ఆసక్తికరమైన ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. తర్వాత  వచ్చే సీజన్​ను సరికొత్త వర్షన్​తో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఈ షో టీవీలో కాకుండా.. ఓటీటీ వర్షన్​ను సిద్ధంచేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా, టీవీలో గంట, రెండు గంటలు కాకుండా.. మొత్తం 24 గంటలు ప్రసారం అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.

    Also Read: షణ్ముఖ్​, సిరి రిలేషన్​పై క్లారిటీ ఇచ్చిన సన్ని

    ఓటీటీలో రానున్న ఈ వర్షన్​కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్​గా వ్యవహరించనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ వర్షన్ డెవలప్ చేసే పనిలో ఉన్నారట. అలాగే నాగ్​ ఎంట్రీ ఎప్పుడుంటుంది?.. ఈ షో ఎప్పటి నుంచి మొదలువుతుంది?.. ఈ సారి హౌస్​మేట్స్ ఎవరన్న విషయాలన్ని త్వరలోనే ఒక్కొక్కటిగా రివీల్ చేస్తామని చెప్పారు. దీంతో బిగ్​బాస్​ ప్రేమికుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. టీవీలో ప్రసారమయ్యే కొద్దిసేపే ఎంతో ఆసక్తిగా ఉంటే.. ఇప్పుడు 24 గంటలంటే ఇంకెంత క్రేజీగా ఉంటుందో అని అంచనాలు వేసుకుంటున్నారు. మరి ఈ సరికొత్త ప్రయత్నం ఏ మేరకు హిట్ అవుతుందో తెలియాల్సి ఉంది.
    Also Read: BigBoss: ప్రేమ పేరుతో మోసపోయిన ప్రముఖ బిగ్​బాస్​ నటి