Pushpa Producer : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయడం ఒకతైతే దానిని అనుకున్న సమయానికి భారీ రేంజ్ లో రిలీజ్ చేయడం అనేది మరొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి… ఎందుకంటే సినిమా తీయడానికి ప్రొడ్యూసర్లు విపరీతమైన డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే సినిమా మీద బజ్ ను క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ రూపంలో కూడా భారీ రేంజ్ లో డబ్బులను వెచ్చించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో హీరోలు గాని, దర్శకులు గానీ ప్రమోషన్స్ కి సపోర్ట్ చేయకపోతే ప్రొడ్యూసర్స్ చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది…
Also Read : తీవ్రంగా నిరాశపర్చిన ‘జాక్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌజ్ ల్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఒకటి…గత సంవత్సరం ‘పుష్ప 2’ (Pushpa 2) సూపర్ సక్సెస్ ని సాధించిన వీళ్లు ఈ సంవత్సరం భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నమైతే చేస్తున్నారు… ఈ బ్యానర్ నుంచి ఏ ఒక్క సినిమా వచ్చినా కూడా దానికి విపరీతమైన స్థాయిలో పబ్లిసిటీ, ప్రమోషన్స్ చేస్తూ ఆ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వీళ్లు ప్రొడ్యూస్ చేసిన రెండు సినిమాలు ఒకే తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికి ఆ సినిమాల మీద ఎలాంటి బజ్ అయితే లేకపోవడం విశేషం…ఇక తమిళ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad ugly) అనే సినిమాతో ఈనెల పదోవ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చేయకపోవడం విశేషం… అలాగే బాలీవుడ్ నటుడు ఆయిన సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా గోపీచంద్ మలినేని(Gopi Chand Malineni) డైరెక్షన్ లో జాట్(Jaat) అనే సినిమా చేశారు. ఇక ఈ సినిమా కూడా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చేయలేదు.
మరి ఎందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేయట్లేదు అనే ఒక క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది… నిజానికి మైత్రివాళ్ళు తెలుగులో ప్రమోషన్స్ కోసం భారీ సన్నాహాలు చేసినప్పటికి ఆయా సినిమాల హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో వీళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. మరి ఈ రెండు సినిమాలు కూడా ఆ రాష్ట్రాల్లో భారీ విజయాలను సాధించి సక్సెస్ లను నిలిస్తే తప్ప మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి లాభాలైతే రావు.
మరి నష్టాల నుంచి తప్పించుకోవాలంటే తెలుగులో వాటిని ప్రమోట్ చేసి ఉంటే బాగుండేదని పలువురు సినిమా మేధావులు సైతం చెబుతూ ఉండటం విశేషం…ఇక దీంతో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అయిన రవి శంకర్, యెర్నేని నవీన్ లు ఇంకోసారి ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ రెండు సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది…
Also Read : LB నగర్ కోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు..మనోజ్ విజయం!