https://oktelugu.com/

Pushpa: పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్​కు​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడో తెలుసా?

Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో  వచ్చిన సినిమా పుష్ప. నిన్న శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ ఆడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం వన్​ మ్యాన్ షోగా నిలిచింది. కొన్ని చోట్ల మిక్స్​డ్​ టాక్ తెచ్చుకున్నా.. ఫ్యాన్స్​ మాత్రం సినిమా దుమ్ములేపిందంచటున్నారు సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్​తో పాటు మిగిలిన పాత్రలన్నీ చింపేశాయని అంటున్నారు. ఈ సినిమాకు యాక్టర్ల నటనే ప్లస్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 12:35 PM IST
    Follow us on

    Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో  వచ్చిన సినిమా పుష్ప. నిన్న శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ ఆడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం వన్​ మ్యాన్ షోగా నిలిచింది. కొన్ని చోట్ల మిక్స్​డ్​ టాక్ తెచ్చుకున్నా.. ఫ్యాన్స్​ మాత్రం సినిమా దుమ్ములేపిందంచటున్నారు సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్​తో పాటు మిగిలిన పాత్రలన్నీ చింపేశాయని అంటున్నారు. ఈ సినిమాకు యాక్టర్ల నటనే ప్లస్​ పాయింట్ అని టాక్​. ప్రస్తుతానికైతే ఈ సినిమా మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తోంది.

    Pushpa

    Also Read: 2021లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలివే..!

    పుష్ప సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ బిజినెస్​ కూడా బాగానే జరిగింది దాదాపు 100 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్​ బిజినెస్​ను జరుపుకుంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నట్లు సమాచారం. పుష్ప సినిమా ఓటీటీ రైట్స్​ను అమెజాన్​ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

    ఈ క్రమంలోనే సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చున్నట్లు సమాచారం. అయితే, సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదలవుతుండటం వల్ల పుష్ప సినిమాను సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించగా.. సునీల్​, అనసూయ, రావురమేశ్​, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    Also Read: అక్కడ సరైన ప్రమోషన్స్​ లేకున్నా.. పుష్పరాజ్ అస్సలు​ తగ్గలేదుగా?