Jupalli Krishnarao: రాజకీయాల్లో అధికారం ఉంటేనే గుర్తింపు. లేదంటే సొంత పార్టీ నేతలు కూడా సరిగ్గా పట్టించుకోరు. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయుకుడికి వర్తిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇలాంటి టైమ్ నడుస్తోంది. ఒకప్పుడు మంత్రి హోదాలో రాష్ట్రంలో చక్రం తిప్పిన ఆయన.. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కానీ 2018 ఎన్నికలు ఆయన్ను దారుణంగా దెబ్బ తీశాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ ఎస్ జెండా అన్ని చోట్లా ఎగిరినా.. ఒక్క కృష్ణారావు మాత్రం గెలవలేకపోయారు. ఇదే ఆయనకు పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఇక ఆయన మీద కాంగ్రెస్ తరఫున గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో మొత్తం హర్షవర్ధన్‌దే హవా సాగుతోంది. కొల్లాపూర్‌లో ఇప్పుడు కృష్ణారావు వర్గంకు పోరు తప్పట్లేదు. ఆయన వర్గంకు పార్టీలో స్థానం, టికెట్లు కూడా దక్కట్లేదు.
ఇక మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఏమైనా పదవి వస్తుందేమో అని ఆశించినా.. చివరకు నిరాశే మిగిలింది. దీంతో ఆయన్ను పార్టీ పూర్తిగా పక్కకు పెట్టేస్తుందేమో అనే అనుమానాలు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పూర్తిగా తనకు పార్టీలో ప్రాముఖ్యత తగ్గించేయడంతో రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారో లేదో అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఆయన రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారంట.
Also Read: D Srinivas: డీఎస్ ఎందుకు కాంగ్రెస్ లో చేరలేదు.. ఆ గ్యాప్ కు కారణమిదే?
ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడటంతో.. టీఆర్ఎస్‌లో అసంతృప్తిలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకు పెద్ద పీట వేస్తోంది. కానీ కృష్ణారావుకు డీకే అరుణకు చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. దాంతో ఆయన ఇప్పట్లో బీజేపీ వైపు చూడట్లేదు. కానీ ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ టికెట్ రాకపోతే కాంగ్రెస్‌లొకి వెళ్లేందుకు ఆలోచిస్తున్నారంట. అప్పటికి కాంగ్రెస్ కూడా టికెట్ ఇవ్వకపోతే ఎలాగూ మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం గెలుపొందింది కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారంట.
Also Read: Inter Examinations: ఇంటర్ పరీక్షల్లో ‘ఫెయిల్’ అయిందెవరు?