https://oktelugu.com/

Adivi Sesh: పెళ్లివైపు గాలి మళ్లిందంటున్న అడవి శేష్​.. వచ్చే ఏడాదిలోనే వివాహం?

Adivi Sesh: టాలీవుడ్​ యంగ్​ హీరో అడవిశేషు వరుస చిత్రాలతో దూసుకెళ్లిపోతున్నారు. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్​. శేష్​కు నటనతో పాటు, కథ- స్క్రీన్ ప్లే లోనూ మంచి పట్టున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మేజర్ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 12:23 PM IST
    Follow us on

    Adivi Sesh: టాలీవుడ్​ యంగ్​ హీరో అడవిశేషు వరుస చిత్రాలతో దూసుకెళ్లిపోతున్నారు. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్​. శేష్​కు నటనతో పాటు, కథ- స్క్రీన్ ప్లే లోనూ మంచి పట్టున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మేజర్ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల చేయనున్నారు.

    Adivi Sesh

    ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను సోనీ పిక్చర్స్ – జీఎంబీ ఎంటర్టైన్మెంట్ – A+S మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మూడు భాషల్లో మొత్తంగా 120 రోజుల పాటు షూటింగ్​ను జరిపారు. ఓవరాల్​గా 75 లొకేషన్లు, 8 భారీ సెట్లు వేసి ఈ సినిమాను తెరకెక్కించారు.

    Also Read: రాజమౌళి మన మధ్య ఉండటం.. భారతీయ సిసీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం- కరణ్ జోహార్​

    ఈ సినమాతో పాటు శేష్ హిట్​ 2 కూడా చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​ను విడుదల చేశారు. అయితే, ఈ కుర్రహీరో కూడా మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​గానే మిగిలిపోయారు. ఇప్పుడు అడవి శేష్​కు(Adivi Sesh) 36ఏళ్లు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పటికే ఇంట్లో పెళ్లి చేసుకోమని అంటున్నారు. నేనేదోకటి చెప్పి వాళ్లని మేనేజ్ చేస్తూన్నా.. కొన్నాళ్లు చూసి చూసి గట్టిగా తిట్టేశారు. అప్పటికీ నేను వినకపోయే సరికి వీడికి చెప్పడం వేస్ట్ అని వదిలేశారు. కానీ, ఇప్పుడు అనిపిస్తోంది పెళ్లి చేసుకోవాలని. నిజం చెప్పాలంటే నాకు పెళ్లిపై గాలి మల్లిందని చెప్పుకోచ్చారు శేష్​. నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంటే బాగుండనిపించింది.. కాబట్టి వచ్చే ఏడాది చేసుకుంటానేమో చూడాలి అంటూ వివరించారు.

    Also Read: అడివి శేష్ బర్త్ డే కానుకగా “హిట్ 2” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్…