Pushpa Movie: “పుష్ప” సినిమా టీమ్ అల్లు అర్జున్ అభిమానులకు అనుకోని షాక్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ సాయంత్రం 06.30 గంటలకు విడుదల చేయాలని పుష్ప టీం మొదటగా ప్రకటించింది. దీంతో అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూశారు. అయితే.. కొన్ని సాంకేతిక కారణంగా వల్ల పుష్ప సినిమా ట్రైలర్ ను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.దీనిపై తాము చింతిస్తున్నామని… అభిమానులకు క్షమాపణలు చెబుతున్నామని ట్వీట్ చేసింది చిత్ర బృందం. దీంతో పుష్ప అభిమానులు నిరాశ కు గురయ్యారు.

Also Read: NTR: ఎన్టీఆర్ తో పోటీపడి ఆస్తులను పోగొట్టుకున్న స్టార్ !
అతి త్వరలోనే పుష్ప టైలర్ అప్డేట్ ను ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది. కాగా… పుష్ప సినిమాను రెండు భాగాలు తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. సక్సెస్ పుల్ మూవీ మేకర్స్ కి కేరాఫ్ గా ఉండే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా ట్రెయిలర్ రిలీజ్ ఆలస్యం చేయడం పట్ల అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
Also Read: Dulquer Salmaan: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దుల్కర్ సల్మాన్ ఫొటోస్.
Due to unforeseen technical issues, we are unable to release #PushpaTrailer today at 6:03PM. We apologise for the delay. Stay tuned to this space.#PushpaTrailerDay #PushpaTheRise #PushpaTheRiseOnDec17
— Pushpa (@PushpaMovie) December 6, 2021