Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ‘రామారావు’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్ తో ఈ సినిమా రాబోతుంది. అయితే, ఈ సినిమాను 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ గా వచ్చే ఈ ఫైట్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయట. పైగా సినిమాలో కథకు మెయిన్ టర్నింగ్ పాయింట్ గా ఈ సీన్స్ ఉండబోతున్నాయట.

శరత్ మండవ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతుంది. ఇక ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు రవితేజ ‘ఖిలాడి’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’లతో బిజీగా ఉన్నాడు.
అయితే, పై సినిమాల విషయంలోనే రవితేజ తన పారితోషికాన్ని రెట్టింపు చేసింది. నిర్మాతలకు రవితేజ నుంచి ఎక్కువ డిమాండ్స్ వెళ్తుంది కూడా ఈ సినిమాలకే. నిజంగానే గతంలో కంటే కూడా.. ఈ మధ్య రవితేజ ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు. రవితేజ రెమ్యునరేషన్ వ్యవహారం పై రోజుకొక రూమర్ వినిపిస్తూనే ఉంది.
Also Read: Kamal Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ కు నోటీసులు జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వం…
అయితే, రవితేజ ఇలా తన పారితోషికం విషయంలో ఎక్కువ డిమాండ్ చేయడానికి కారణం.. తన క్రాక్ సినిమా భారీ వసూళ్లను సాధించింది అని, పైగా తోటి హీరోలకు తనకు బాగా వ్యతాసం ఉందని, వారిలా తాను ఎక్కువ రోజులు షూట్ చేసి, నిర్మాతలను ఇబ్బంది పెట్టను అని, అందుకే రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదు అని నిర్ణయించుకున్నాను అని చెబుతున్నాడు.
అయితే, ఏడాది క్రితం వరకు రవితేజకు అన్నీ అపజయాలే వచ్చాయి. అప్పుడు ఆయన సినిమాలకు భారీ నష్టాలు వచ్చాయి. కాకపోతే ఒక్క క్రాక్ సినిమాకు మాత్రం కాస్త.. అంటే.. రెండు కోట్లు వరకు లాభాలు వచ్చాయి. మరి ఇప్పుడు ఆ రెండు కోట్లు తనకే కావాలి అంటూ రవితేజ డిమాండ్ చేస్తే.. ఇక నిర్మాతల పరిస్థితి ఏమిటి ? రవితేజకే తెలియాలి.
Also Read: OTT Releases of the Week: ఈ వారం ‘ఓటీటీ’ రిలీజ్ ల పరిస్థితేంటి ?