Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న సినిమా పుష్ప. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ప్రకటించిన మొదటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే టీజర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేసి.. అందుకు తగ్గ హైప్‌ను పెంచారు మేకర్స్. సాధారణంగా సుకుమార్- అల్లు అర్జున్ కాంబో అంటేనే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. […]
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న సినిమా పుష్ప. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ప్రకటించిన మొదటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే టీజర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేసి.. అందుకు తగ్గ హైప్‌ను పెంచారు మేకర్స్.
సాధారణంగా సుకుమార్- అల్లు అర్జున్ కాంబో అంటేనే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఆర్య, ఆర్య2 సినిమాల్లో బన్నీని కొత్తగా చూపించడమే అందుకు కారణం. మరోవైపు రంగస్థలంతో ఫుల్‌ఫామ్‌లోకి వచ్చి సుకుమార్.. ఈ సినిమాతో మరో భారీ హిట్ అందుకోవాలని బలంగా అనుకంటున్నట్లు కనిపిస్తోంది.
ఇక సుకుమార్- దేవి శ్రీ కాంబోలో వచ్చే సినిమాలో ఐటెం సాంగ్ కూడా స్పెషల్‌గానే ఉంటుంది. ఈ క్రమంలోనే పుష్పలోని ఐటెం సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామ పేరుతో వచ్చిన ఈ సాంగ్‌లో సమంత తన అందాలు ఆరబోస్తూ.. హాట్ లుక్స్‌తో కవ్వించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ పాట.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విడుదలైన 24 గంటల్లోనే 14 మిలియన్ వ్యూస్‌కు చేరుకుని.. సౌత్ ఇంియా మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచింది. దేవి శ్రీ బీట్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్ 2లో దూసుకెళ్తోంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.