Homeఎంటర్టైన్మెంట్The Gray Man: ఇంత గొప్ప సినిమాలో భాగమవుతానని ఎప్పుడూ అనుకోలేదు- ధనుష్​

The Gray Man: ఇంత గొప్ప సినిమాలో భాగమవుతానని ఎప్పుడూ అనుకోలేదు- ధనుష్​

The Gray Man: తమిళ స్టార్​ హీరో ధనుష్​ హాలీవుడ్​లో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ది గ్రేమ్యాన్ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రియాన్​ గ్లోసింగ్​, క్రిస్​ ఎవాన్స్​, అనా ి అర్మాస్​, జెస్సికా హెన్విక్​ తదితర హాలీవుడ్​ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్నా ఈ సినిమా విశేషాలను ధనుష్​ తెలిపారు. ఇటీవలే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

dhanush-latest-interview-about-the-gray-man-movie

ఇంత గొప్ప సినిమాలో తను భాగమవుతానని ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. తనకు ఆసక్తికరమైన అవకాశమని.. ఇందులో నటుడిగా ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు ధనుష్​. ఈ సినిమాతో ప్రయాణం తనకు బాగా నచ్చిందని అన్నారు. అంతే కాకుండా.. ఈ సినిమాతో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తానె ప్పుడూ అవకాశాల వెంట పడలేదని.. తన వద్దకు వచ్చినవి నచ్చితే నిజాయితీగా ప్రాణం పెట్టిన చేస్తూ వెళ్తానని వివరించారు. ఈ ప్రయాణం ఎక్కడివరకన్నది ఆ దేవుడిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. మార్క్ గ్రీనీ రాసిన ఓ నవల ఆధారంగా విభిన్నమైన యాక్షన్​ థ్రిల్లర్​గా ది గ్రేమ్యాన్​ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఓటీటీ వేదికైన నెట్​ఫ్లిక్స్​లో ఈ సినిమా విడుదల కానుంది.

కాగా, రఘువరన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ధనుష్​.. ఆ తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ టాప్​లో దూసుకెళ్లిపోతున్నారు. చేసిన ప్రతి సినినా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇటీవలే వచ్చిన జగమే తందిరం సినిమా కూడా విభన్న కథాంశంతో తెరకెక్కిందే. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాల్సి ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular