
అడవి అందాలను చూపిస్తూ.. కూలీల వ్యథలను కంటికి కనిపించేలా చేస్తూ ఎర్రచందనం దొంగల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించేలా పాటను రూపొందించాడు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ అయ్యింది.
#Pushpa First Single పేరుతో రిలీజ్ అయిన ఈ పాటలో అడవిలో ఎర్రచందనం దొంగతనం చేసే అల్లు అర్జున్ హీరో ఎలివేషన్ ను ఈ పాటలో చూపించారు. అల్లు అర్జున్ ను ఊరమాస్ పాత్రలో గొడ్డలి పట్టుకొని కరుకు రౌడీగా చూపించారు.
ఆ ఎక్స్ ప్రెషన్స్, హావభావాలు.. డ్యాన్సింగ్ కూడా అంతే కరుకుగా చూపించారు. ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుతుద్ది పీక’ సాగిన ఈ పాట ఎర్రచందనం దొంగతనాలు ఎంత క్రూరంగా చేస్తారన్నది సాగేలా రూపొందించారు.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శివం ఆలపించారు. పాటలో ఆద్యంతం ఎర్రచందనం దొంగల ఆధిపత్యాన్ని వివరించేదిగా రాశారు. చంద్రబోస్ ఈ పాటను రాశారు. ఊర మాస్ గా ఉన్న ఈ సాంగ్ ను కింద చూడొచ్చు..
#PushpaFirstSingle 🔥#DaakkoDaakkoMeka – https://t.co/ZhnWFST5v2#OduOduAadu – https://t.co/w3hEHlNeHE#OduOduAade – https://t.co/VU2j5MoksO#JokkeJokkeMeke – https://t.co/CwZ1d7boFM#JaagoJaagoBakre – https://t.co/n4X6RdIyZs#PushpaTheRise@alluarjun @ThisIsDSP @aryasukku pic.twitter.com/FjJs7XjvZs
— Mythri Movie Makers (@MythriOfficial) August 13, 2021