https://oktelugu.com/

Pushpa: ‘పుష్ప’ను వెంటాడుతున్న సెన్సార్ కష్టాలు.. అక్కడ ఈరోజే?

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా వస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజు కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజు వేడుకలను పూర్తి చేసుకున్న ‘పుష్ప’పై అల్లు ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. హిందీ మినహా అన్ని దక్షిణాది అన్ని భాషల్లో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ చిత్రయూనిట్ భారీగా చేస్తోంది. రేపు ఈ సినిమా రిలీజు కానుండగా హిందీ వర్షన్ సెన్సాన్ ఇంకా పూర్తి కాలేదని […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2021 / 11:17 AM IST
    Follow us on

    Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా వస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజు కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజు వేడుకలను పూర్తి చేసుకున్న ‘పుష్ప’పై అల్లు ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. హిందీ మినహా అన్ని దక్షిణాది అన్ని భాషల్లో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ చిత్రయూనిట్ భారీగా చేస్తోంది.

    Pushpa

    రేపు ఈ సినిమా రిలీజు కానుండగా హిందీ వర్షన్ సెన్సాన్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ గత చిత్రాల మాదిరిగానే చివరి నిమిషం వరకు ఎడిటింగ్ పై కూర్చోవడంతో ఎప్పటిలాగే ఈ సినిమా ఫస్టు కాపీ ఆలస్యమైంది. మిగతా భాషల్లో సెన్సార్ పూర్తయినప్పటికీ హిందీ వెర్షన్ కాపోవడంతో సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉండదు.

    దీంతో చిత్రయూనిట్ ఆఘమేగాల మీద నేడు ముంబైలో సెన్సార్ పనులను చేపడుతోంది. ‘పుష్ప’ మూవీ రేపే రిలీజు కానున్న నేపథ్యంలో సెన్సార్ సభ్యులు కూడా ఈరోజే చిత్రాన్ని చూసి సర్టిఫికెట్ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ సినిమా హిందీ వర్షన్లో ఎంత నిడివితో ఉంటుందనే తెలియాల్సి ఉంది.

    హిందీ వర్షన్ సెన్సార్ ఆలస్యం కావడంతోనే ఈ మూవీ ప్రమోషన్స్ అక్కడ పెద్దగా జరుగలేదని తెలుస్తోంది. మిగతా ఇండస్ట్రీల్లో మాత్రం ‘పుష్ప’ ప్రమోషన్స్ ను అల్లు అర్జునే తన భుజాలపై మోస్తున్నాడు. దీంతో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో సినిమాకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. అయితే హిందీ మాత్రం అనుకున్నంతగా టికెట్లు బుక్ కావడం లేదనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: రేపే రిలీజ్.. పీకల్లోతు కష్టాల్లో పుష్ప !

    ఇదిలా ఉంటే ‘పుష్ప’కు సంబంధించి తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఖరారయ్యారు. తమిళంలో ‘లైకా ప్రోడక్షన్స్’, కన్నడలో ‘స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్’ హిందీలో ఎఎ ఫిల్మ్స్ పంపిణీ చేస్తోంది. ఎఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసింది. కాగా ఈరోజు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంభ థియేటర్స్‌లో ‘పుష్ప’ ప్రీమియర్స్ వేస్తున్నారు.

    ఇప్పటికే ‘పుష్ఫ’కు సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్యాన్ ఇండియా లెవల్లో అర్జు అర్జున్ సినిమా తొలిసారి రిలీజు కానుండటంతో అల్లు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సినిమా టికెట్ల విషయంలో ఏపీలోని ‘పుష్ప’కు లైన్ క్లియర్ కావడంతో ఈ మూవీ ఏమేరకు కలెక్షన్లు రాబడుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: పుష్ప కోసం వెయిటింగ్ అంటున్న విజయ్ దేవరకొండ… అల్లు అర్జున్ స్వీట్ రిప్లై