Homeజాతీయ వార్తలుCh. Vittal: తెలంగాణ ఉద్యమంలో తెరవెనుక ఏం జరిగింది.. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత...

Ch. Vittal: తెలంగాణ ఉద్యమంలో తెరవెనుక ఏం జరిగింది.. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత విఠల్’ చెప్పిన సంచలన నిజాలు

Ch. Vittal: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉద్యమ నేతల్లో సీహెచ్ విఠల్ ఒకరు. తెలంగాణ పోరాటానికి ఆయువై నిలిచారు ప్రభుత్వ ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించిన ఐదుగురు కీలక వ్యక్తుల్లో సీహెచ్ విఠల్ ఒకరు. ఈయనను ‘తెలంగాణ విఠల్’ అని కూడా ఉద్యోగులు పిలుస్తుంటారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ‘మిలియన్ మార్చ్, సాగరహారం’ సహా ఎన్నో పోరాటాల్లో విఠల్ కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమ మూలాలు ప్రారంభమైన 1996 నుంచి రాష్ట్రం ఏర్పడ్డ 2014 జూన్ 2 వరకూ విఠల్ అన్ని పోరాటాల్లో ‘నేను సైతం’ అని పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కోదండరాం సహా ఎంతో మంది కీలక ఉద్యమనేతలతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు.

Ch. Vittal
ch vittal interview

విఠల్ లాంటి ఉద్యోగ నేతల సారథ్యంలోనే సకలజనుల సమ్మెతో కేంద్రం మెడలు వంచారు. తెలంగాణ ఉద్యమానికి నాడు ప్రభుత్వ ఉద్యోగులే ఊపిరి. ఈ ఉద్యమం ఇలా పటిష్టంగా తయారుకావడానికి నాటి ఉద్యోగ సంఘాల నేతలే ఆయువుపట్టు. ఉద్యమ తొలినాళ్లలో అసలు ఎలా పోరాటం చేయాలో వ్యూహాలు రచించిన వారిలో తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత విఠల్ ఒకరు. తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా.. కోచైర్మన్ గా విఠల్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

నాడు ఉద్యోగ సంఘం నేతగా విఠల్ చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం. తెలంగాణ వచ్చాక టీఎస్.పీఎస్.సీ లో కీలక పదవిని దక్కించుకున్నారు. ఆయన పదవీ కాలం ఏడాది క్రితం ముగిసింది. అనంతరం తాజాగా బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది.? ఎవరు ప్రారంభించారు? తెరవెనుక ఏం జరిగింది? కేసీఆరే అంతా చేశారా? అసలు ఎవరు కీలక భూమిక పోషించారు లాంటి సంచలన విషయాలను పంచుకున్నారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి.

తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలను విఠల్ వివరించారు. కేసీఆర్, చంద్రబాబు పోషించిన పాత్రలను విఠల్ వీడియోలో తెలిపారు. ఇక ఉద్యమంలో ప్రజా సంఘాల పాత్రలపై కూలకషంగా చర్చించారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పాత్రను వివరించారు. ఇప్పటివరకూ ఉద్యమంలో ఏం జరిగిందనేది ఎవరూ ఇంత డీటెయిల్డ్ గా వివరించలేదు. సమగ్రమైన లోతైన విశ్లేషణను విఠల్ చేశారు.

‘‘వాజ్‌పేయి ఉన్నపుడే తెలంగాణా రావాలి, రాకుండా అడ్డుకున్నది ఎవరన్నది సంచలన నిజాన్ని పంచుకున్నారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ఉద్యమాన్ని ప్రజలోకి తీసుకోని వెళ్ళటానికి ఏం చేసారు? 2009 లో కేసీఆర్, చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడన్న సీక్రెట్ ను బయటపెట్టారు.  తెలంగాణా ఉద్యమ కార్యక్రమాలలో ప్రతి కార్యక్రమానికి ‘S’ అనే వచ్చేలా ఎందుకు చేశామన్న రహస్యాన్ని రివీల్ చేశారు  కేసీఆర్ ఎందుకోసం కోసం తెలంగాణా రావాలి అని అనుకున్నాడది వివరించాడు.  కేసీఆర్ కి నీళ్లు, నిధుల మీద ఉన్న శ్రద్ధ నియామకాల మీద లేదో కూడా బయటపెట్టాడు.  మున్నూరు కాపులను కేసీఆర్ ఎందుకు దూరం పెడుతున్నాడన్నది సవివరంగా పంచుకున్నాడు.’’

Also Read: విజయ్ దివస్-1971 భారత్ పాక్ యుద్ధానికి 50 ఏళ్లు.. ఆరోజు ఏం జరిగిందంటే..?

తాను ఎందుకు టీఆర్ఎస్ లో చేరకుండా బీజేపీలో చేరారన్నది విఠల్ బయటపెట్టారు. మొదటి రాజకీయాల్లోకి వచ్చిన విఠల్ బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆయన ఉద్యమ నేతలను ఎందుకు పక్కనపెట్టారు.. పెడచెవిన పెట్టారు. ఇప్పుడందరూ బీజేపీలో ఎందుకు చేరుతున్నారు..? తెలంగాణలో బీజేపీ గెలవబోతోందని.. దానికి కారణం కేసీఆర్ అని విఠల్ చెబుతున్నారు..

విఠల్ చెబుతున్న సమగ్రమైన విశ్లేషణను ఈ కింది వీడియోలో చూడొచ్చు..

Exclusive Interview with Telangana Leader CH Vittal | Sr Journalist Chandu Janardhan | OkTelugu

Also Read: త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి రేసులో కవిత, కడియం, ప్రకాశ్..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version