Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ పై భారీ అంచనాలు ఉన్నాయని చిత్రబృందం పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ లో చెబుతుంది. కానీ, ఒక్క తెలుగులో తప్ప మరో ఏ ఇతర భాషలో పుష్పకి గిట్టుబాటు అయ్యేలా లేదు. పుష్ప మొదట బాహుబలి అడుగుజాడల్లో నడవాలని ప్లాన్ చేసుకుంది. అంతలో ఆర్ఆర్ఆర్ ప్రోమోలు, టీజర్లు వచ్చాయి. రాజమౌళి బాహుబలికి భిన్నంగా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.
అది గమనించిన పుష్ప టీమ్ బాహుబలి పద్దతులను పక్కన పెట్టింది. కానీ, వేరే ఏ ప్లాన్ లు లేకపోవడంతో ఫస్ట్ పార్ట్ విషయంలో సినిమాని జనంలోకి తీసుకువెళ్లడంలో వెనక పడింది. ఒకపక్క బడ్జెట్ అనుకున్న దాని కంటే నలభై కోట్లు పెరిగింది. రెండో భాగం పెట్టుబడి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఈ సినిమాకి డెఫిసిట్ గా వచ్చే మొత్తం ఏమి లేదు అని అంటున్నారు.
పైగా కరోనా కారణంగా సినిమా బాగా లేట్ అయింది. దాంతో వడ్డీలు భారీగా పెరిగాయి. కనీసం రెండేళ్ల పాటు వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తమ్మీద బాహుబలి అడుగుజాడల్లో నడవాలని ప్రయత్నాలు మొదలుపెట్టి చివరకు పుష్ప కాలు జారింది. దీనికితోడు పుష్ప ఊర మాస్ సినిమాగా తెరకెక్కింది.
అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ? ఇంతకుముందు వర్మ ‘వీరప్పన్’ అనే సినిమా చేశాడు కదా. అందుకే ఈ సినిమాపై వేరే బాషల ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి లేదు. తెలుగులో ఎలాగూ బన్నీకి మార్కెట్ ఉంది కాబట్టి.. ఓపెనింగ్స్ వస్తాయి. కానీ, ఏపీలో టికెట్ రేటు విషయంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే.. అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యమే.
Also Read: RRR: రికార్డుల వేట మొదలుపెట్టిన ‘ఆర్ఆర్ఆర్’.. 100 మిలియన్ల వ్యూస్‌కు చేరుకున్న ట్రైలర్
అందుకే, పుష్ప పరిస్థితి ఏమిటా అని మేకర్స్ లో ఓ భయం మొదలు అయింది. మరోపక్క పుష్పకు పోటీ ఎక్కువ కూడా అయింది. ఈ రోజు హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నాయి. ఇక ఈ నెల 24న బాలీవుడ్ సినిమా 83 రానుంది. ఆ తర్వాత ‘నాని’ మూవీ శ్యామ్ సింగరాయ్. మొత్తానికి పుష్ప పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్లే.
Also Read: Samantha: ఆడవాళ్లు అలా మగవాళ్ళు ఇలా… సమంత భలే ప్లస్ అయ్యిందే!