Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియాలో బాహుబలి 2 వసూళ్లను దాటి ఏకంగా 1850 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. 40 రోజులు దాటిపోయింది, ఇక ఈ సినిమా జ్జోరు ఏముంటుందిలే, అంత అయిపోయింది అని అనుకున్న వాళ్లకు నిన్న దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఈ చిత్రం. బుక్ మై షో యాప్ లో గంటకి 2 నుండి మూడు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అనేక ప్రాంతాలలో హౌస్ ఫుల్స్ ని కూడా నమోదు చేసుకుంది ఈ చిత్రం. ముఖ్యంగా సీడెడ్ లో అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో ఈ చిత్రం 5 రోజుల క్రితం విడుదలైన ‘గేమ్ చేంజర్’ ని కూడా డామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
40 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం 41 వ రోజున ఏకంగా పాతిక లక్షల రూపాయిల షేర్ వసూళ్లను దక్కించుకొని సంచలనం సృష్టించింది ఈ చిత్రం. సరిగ్గా మూడు వారాలు ఆడితే చాలా ఎక్కువ అని అనుకుంటున్న ఈ ఓటీటీ కాలం లో ఒక సినిమా నెలకు రోజులకు పైబడి ఆడడం, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదని చెప్పాలి. నార్త్ అమెరికా లో అయితే ముంబై, ఢిల్లీ, పంజాబ్ వంటి చోట్ల ఇప్పటికీ ఈ చిత్రం వందకి పైగా షోస్ ని ప్రదర్శించుకుంటుంది. ఈపాటికి ఓటీటీ లో విడుదలై ప్రేక్షకులకు చేరాల్సిన ఈ సినిమా థియేటర్స్ లో దుమ్ము లేపుతూ కొత్తగా వచ్చిన పాన్ ఇండియన్ సూపర్ స్టార్ సినిమాని కూడా డామినేట్ చేయడం అంటే మాటలు కాదు.
నార్త్ అమెరికా లో అన్ని ప్రాంతాల్లో కూడా ‘పుష్ప 2 ‘ చిత్రం ‘గేమ్ చేంజర్’ కంటే ఎక్కువ థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఎల్లుండి నుండి ఈ సినిమాకి సంబంధించిన 20 నిమిషాల అదనపు ఫుటేజీ ని జత చేయబోతున్నారు. దీనికి పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఈ 20 నిమిషాల ఫుటేజీ అల్లు అర్జున్ తన డబ్బింగ్ ని కూడా పూర్తి చేసాడు. దీంతో ఈ చిత్రానికి ఇంకా ఎక్కువ థియేట్రికల్ రన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాస్తవానికి జనవరి 11 నుండి ఈ వెర్షన్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని అనుకున్నారు. కానీ బెటర్ ఔట్పుట్ కోసం వారం రోజులు వాయిదా వేశారు. ఈ 20 నిమిషాల ఫుటేజీ తో సినిమా నిడివి కాస్త మూడు గంటల 40 నిమిషాలకు చేరింది. ఇదే కంటెంట్ ని ఓటీటీ లో కూడా విడుదల చేయబోతున్నారట మేకర్స్.