Tollywood : మనమందరం ఎన్నో ఆశలతో, కలలతో 2024 నుంచి 2025లోకి అడుగుపెట్టాం. గడిచిన ఏడాది కొంతమందికి చేదు జ్ఞాపకాలను మిగిలిస్తే మరి కొంతమందికి మాత్రం మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. అలాగే కొంతమంది సినిమా సెలబ్రిటీలకు గడిచిన ఏడాది చాలా మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. ముఖ్యంగా ఈ నలుగురు టాలీవుడ్ హీరోలకు 2024 సంవత్సరం బాగా కలిసొచ్చిందని తెలుస్తుంది. ఆ నలుగురు హీరోలకు 2024 చాలా స్పెషల్ అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2024 సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరో మహేష్ బాబుకు జోడిగా నటించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమా అనుకున్నట్టుగానే భారీ విజయం సొంతం చేసుకుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవర సినిమా కూడా 2024 లో రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించింది. జాహ్నవి కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక దేవర సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.
అదే విధంగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కూడా ఎన్నో అంచనాల మధ్య 2024 సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుందని వార్తలు వినిపించాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడి 2025 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సీక్వెల్ కూడా 2024 ఆగస్టులో రిలీజ్ కాబోతుందని ముందుగా వార్తలు వినిపించాయి.
కానీ కొన్ని కారణాల వలన కొంచెం ఆలస్యమైన ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్న దానికంటే భారీ స్థాయిలో పుష్ప 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మొదటి భాగం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. ఈ విధంగా 2024 సినిమా ఇండస్ట్రీకి చాలా విశేషం. 2024లో ఈ నలుగురు బడా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యి 2024ను చాలా స్పెషల్ గా మార్చాయి.