Sookshmadarshini Movie : ఒక సినిమా హిట్ అవ్వడానికి సినిమా కంటెంట్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్టార్ హీరో, హీరోయిన్, స్టార్ దర్శకులు వందల కోట్ల బడ్జెట్ ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది అని అనుకుంటే అది పొరపాటే. చిన్న సినిమా అయినా సరే ఆ సినిమాలో కంటెంట్ బాగుంటే దానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ఇలా ఇప్పటివరకు ఎన్నో చిన్న చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం ఇలాంటి ఒక చిన్న సినిమానే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయం సాధించి సంచలనం క్రియేట్ చేస్తుంది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 60 కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ విజయం సాధించింది. గత ఏడాది నవంబర్ 22న సూక్ష్మ దర్శిని అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటువంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూక్ష్మ దర్శిని హిట్ టాక్ తో సూపర్ హిట్ విజయం సాధించింది. నజరియా నజీమ్, బాసిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలోని మిస్టరీ, థ్రిల్లర్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఓటిటీ లో చూడడానికి ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రసారహక్కులను ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ ఏడాది జనవరి 11వ తేదీ నుంచి సూక్ష్మ దర్శిని సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
సస్పెన్స్, థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా మలయాళం తోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో కూడా అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు జనవరి 11 నుంచి ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు. ఈ సినిమా మలయాళ భాష బ్లాక్ కామెడీ మిస్టరీ చిత్రం. ఎం సి జితన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. లిబిన్ టీ బి, అతుల్ రామచంద్రన్ ఈ సినిమాకు కథను అందించారు.
తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ సినిమాలోని థ్రిల్లర్, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలుస్తుంది. ఆసక్తికరమైన కథ, కథనాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్. థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటిటీ లో కూడా ప్రసారం అవుతుంది.ఓటిటీ లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుంది.