Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టింది. తెలుగు, హిందీ, తమిళం అని తేడా లేకుండా ప్రతీ భాషలోనూ ఓపెనింగ్స్ దంచి కొట్టింది. #RRR కి కూడా ఈ స్థాయి వసూళ్లు రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా టాలీవుడ్ తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం ప్రకంపనలు సృష్టించింది. ఇది సాధారణమైన విషయం కాదు. భవిష్యత్తులో రాజమౌళి సినిమాకి కూడా పెద్ద సవాల్. ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్స్ కి కూడా ఈ రేంజ్ ఓపెనింగ్ వసూళ్లను అందుకోవడం కష్టమే. ఓవరాల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు వివరంగా చూద్దాము.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి దాదాపుగా మొదటి రోజు 93 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ ప్రతీ చిన్న సెంటర్ లోనూ రికార్డు స్థాయి హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది. తమిళనాడు లో ఈ చిత్రానికి ఈ ఏడాది విడుదలైన సూర్య ‘కంగువా’ తో సమానంగా ఓపెనింగ్ వసూళ్లు వచ్చినట్టు తమిళనాడు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 10 కోట్ల 72 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు విడుదలైన అన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలకంటే ఈ చిత్రానికే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దీనిని ఆల్ టైం రికార్డుగా పరిగణిస్తున్నారు మేకర్స్. అదే విధంగా కర్ణాటక లో ఈ చిత్రానికి తెలుగు, హిందీ, కన్నడ భాషలకు కలిపి 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
ఇక అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ గా పిలవబడే కేరళలో కూడా ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్ వచ్చింది. అక్కడి ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి మొదటిరోజు 6 కోట్ల 56 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది బాలీవుడ్ కలెక్షన్స్. తెలుగు తర్వాత ఇక్కడి ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూసారు. మొదటి రోజు ఈ ప్రాంతం లో దాదాపుగా 87 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఆల్ టైం రికార్డు గా పరిగణిస్తుంది బాలీవుడ్ ట్రేడ్. ఓవర్సీస్ లో కూడా హిందీ వెర్షన్ వసూళ్లు కళ్ళు చెదిరే రేంజ్ లో వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటిరోజు 283 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో #RRR సాధించిన 243 కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ రికార్డు బ్రేక్ అయ్యింది.