https://oktelugu.com/

Pushpa 2: The Rule : మెగా ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్లే హీరో ఎవరు..?అల్లు ఫ్యామిలీ ముందు మెగా హీరోలు నిలబడతారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న హీరోలందరూ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన వాళ్లే కావడం విశేషం...ఇక స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న ఈ హీరోల వల్ల కొంతమంది యంగ్ హీరోలకు అన్యాయం జరుగుతుందని కొందరు వాదిస్తుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 23, 2024 / 07:12 PM IST

    Allu Arjun

    Follow us on

    Pushpa 2: The Rule : ప్రస్తుతం ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య మంచి ఫైట్ అయితే జరుగుతుంది. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరో అంటూ చెప్పుకొని స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం అల్లు ఫ్యామిలీ అంటూ సపరేట్ అయిపోవడం మెగా ఫ్యాన్స్ కి కొంతవరకు కోపాన్ని తెప్పిస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వారైతే నడుస్తుంది. మరి ఇందులో మెగా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే హీరో రామ్ చరణ్ కాగా, అల్లు ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే హీరో అల్లు అర్జున్ గా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరి మధ్య ఎదురవుతున్న పోటీని తట్టుకొని ఎవరు ఏ స్థాయిలో నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా ఎలివేట్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియాలో వీళ్ళను మించిన నటులు మరొకరు లేరు అనేంతల ఇద్దరు మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే పుష్ప సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది తెలియాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాతో కూడా రామ్ చరణ్ భారీ సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉంది.

    ఇక మొత్తానికైతే మెగా ఫ్యామిలీలో చిరంజీవి ఏజ్ అయిపోవడం, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్లడంతో మెగా ఫ్యామిలీ బాధ్యత మొత్తాన్ని రామ్ చరణ్ మోయాల్సిన అవసరం అయితే ఉంది. మరి తను మెగా ఫ్యామిలీ బాధ్యతలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక గతంలో బాలయ్య బాబు చిరంజీవి మధ్య మంచి పోటీ ఉండేది.

    మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అన్నట్టుగా సాగిన ఈ పోరు ప్రస్తుతం మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫామిలీ వరకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మరి కొంతమంది ట్రైడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఎందుకంటే మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కలిసిపోయి త్రిబుల్ ఆర్ అనే సినిమా చేయడంతో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ అందరిలో ఒక స్థాయి నమ్మకం అయితే వచ్చేసింది. మరి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరు టాప్ హీరోగా ఎదుగుతారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది…