https://oktelugu.com/

Viral Video : ప్రత్యర్థులనే కాదు.. పులులు, గొరిల్లాతో సైతం మైక్ టైసన్ పోరాడాడు.. వీడియో వైరల్

మైక్ టైసన్ ఇటీవల జేక్ పాల్ తో పోరాడాడు. రింగ్ లో దిగి హోరాహోరీగా పోరాటం చేశాడు. అయితే ఈ పోటీలో జేక్ పాల్ విజయం సాధించాడు.. అయితే ఈ బౌట్ కోసం మైక్ టైసన్ కు 168 కోట్ల దాకా లభించాయని తెలుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 17, 2024 6:34 pm
Mike Tyson

Mike Tyson

Follow us on

Viral Video :  ఏటి అండ్ టి స్టేడియంలో పాల్, టైసన్ మధ్య మ్యాచ్ జరిగింది. టెక్సాస్ ప్రాంతంలో జరిగిన ఈ మ్యాచ్ కు 73,000 మంది హాజరయ్యారు. మ్యాచ్ కంటే ముందు టైసన్ విలేకరులతో మాట్లాడాడు. అభిమానులు తన విజయం కోసం ఎదురుచూస్తున్నారని భావించాడు. ఆ మ్యాచ్ ముందు విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంగా టైసన్ నగ్నంగా ఉండడం విశేషం. అయితే ఈ మ్యాచ్లో పాల్ చేతిలో టైసన్ ఓడిపోయాడు. ఈ ఓటమి తర్వాత ఆంగ్ల మీడియా టైసన్ జీవితానికి సంబంధించి రకరకాల కథనాలను ప్రచురించడం మొదలుపెట్టింది. అందులో అత్యంత ఆసక్తికరమైనది టైసన్ క్రూర మృగాలతో పోరాటం చేయడం.. యువకుడిగా ఉన్నప్పుడు పైసల్ ఒక పెద్ద గొరిల్లాతో పోరాటం చేశాడు. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ అనే పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. టైసన్ ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అదే విషయాన్ని వెల్లడించాడు. టైసన్ యువకుడిగా ఉన్నప్పుడు 1980 కాలంలో ఒకసారి తన భార్య రాబిన్ గివెన్స్ (ఇప్పుడు మాజీ) తో కలిసి టైసన్ న్యూయార్క్ వెళ్ళాడు. అక్కడి జూ ను సందర్శించాడు. ఆ సమయంలో జూ మూసి ఉంది. వచ్చింది టైసన్ కావడంతో అతడి కోసం సిబ్బంది ప్రత్యేకంగా జూ ను తెరిచారు.. ఆ సమయంలో జూ లో అతిపెద్ద సిల్వర్ బ్యాక్ గొరిల్లా తోటి జంతువులను వేధించడం మొదలుపెట్టింది. అది టైసన్ చూశాడు. తోటి జంతువులను అది వేధించడాన్ని టైసన్ తట్టుకోలేకపోయాడు. వెంటనే గొరిల్లాతో తలపడాలని నిర్ణయించుకున్నాడు. పదివేల డాలర్లు ఇస్తానని జూ కీపర్ కు చెప్పి.. దానితో పోరాడాలని భావించాడు. దానికి జూ కీపర్ ఒప్పుకోలేదు. ఇది మాత్రమే కాదు గతంలో లాస్ వేగాస్ ప్రాంతంలో టైసన్ కు అతిపెద్ద మాన్షన్ ఉండేది. అందులో అతడు రెండు పులులు పెంచుకునేవాడు. చిన్నప్పుడే వాటిని తెచ్చుకున్న అతడు.. రెండు సంవత్సరాల దాకా సాకాడు. అయితే ఒకసారి పులి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో అప్పటినుంచి పులులకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. వాటిని ఓ జంతు ప్రదర్శనశాలకు ఇచ్చాడు.

అది మూర్ఖపు నిర్ణయం

పులులు పెంచుకోవడం మూర్ఖపు నిర్ణయం అని టైసన్ అంగీకరించాడు. పులులు నూటికి నూరు శాతం క్రూర జంతువులని.. వాటిని ఎంతసేపు మనం సాకినప్పటికీ అవి సాధు జంతువులుగా మారమని టైసన్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు.. ఒక్కోసారి పెంచుకుంటున్న పులులు చంపడానికి ప్రయత్నించవచ్చని టైసన్ పేర్కొన్నాడు. ఆత్మ రక్షణ కోసం మనం ఒకవేళ వాటిని కొడితే.. అవి తిరగబడే ప్రమాదం కూడా ఉంటుందని టైసన్ వివరించాడు..” నేను రెండు పులులను పెంచుకున్నాను. అవి చిన్నగా ఉన్నప్పుడు నాతో సరదాగా ఉండేవి. పెద్దగా అవుతున్న కొద్దీ వాటి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అవి ఎదురు తిరగడం మొదలుపెట్టాయి. ఒకసారి నాపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. అప్పటినుంచి నాకు వాటిని చూస్తే భయం అనిపించింది. పులులను పెంచుకోవడం మూర్ఖపు నిర్ణయం అని తెలిసింది. ఆ తర్వాత వాటిని ఓ జంతు ప్రదర్శనశాలకు ఇచ్చానని” టైసన్ వివరించాడు. మరోవైపు ఇటీవల పాల్ తో జరిగిన మ్యాచ్లో టైసన్ 168 కోట్లు స్వీకరించాడు. మ్యాచ్ గెలిచిన పాల్ కు 337 కోట్లు వచ్చాయి. అతడు అమెరికాలో ఫేమస్ యూట్యూబర్. పైగా అతని వయసు 30 సంవత్సరాల లోపే. టైసన్ వయసులో అతడిది సగం. అయినప్పటికీ అతడి పై గెలవడానికి టైసన్ 8 రౌండ్ల దాకా పోరాడాడు. ఈ మ్యాచ్ నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ అయింది. ఏకంగా ఆరు కోట్ల మంది ఆ షో వీక్షించారు. అంతకంతకు వీక్షకులు పెరిగిపోవడంతో నెట్ ఫ్లిక్స్ సర్వర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. కొంత సమయం వరకు నెట్ ఫ్లిక్స్ పనిచేయలేదంటే టైసన్ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.