https://oktelugu.com/

Pushpa 2: The Rule : పుష్ప 2 నుండి శ్రీలీల ఐటెం సాంగ్ కిస్సిక్ ప్రోమో వచ్చేసింది, చూశారా?

అల్లు అర్జున్ కోసం ఫస్ట్ టైం ఐటెం గర్ల్ గా మారింది శ్రీలీల. పుష్ప 2 మూవీలో ఆమె గ్లామర్ విందు ఇవ్వనుంది. కిస్సిక్.. అనే ఈ సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేస్తున్నారు. కాగా నేడు ప్రోమోతో ఫ్యాన్స్ కి చిన్న ట్రీట్ ఇచ్చారు. మీరు కూడా ప్రోమో మీద ఓ లుక్ వేయండి.

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2024 / 11:21 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: The Rule : పుష్ప 2 ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సౌత్ కి మించిన క్రేజ్ నార్త్ లో ఈ సినిమాపై ఏర్పడింది. మొన్నటి వరకు కొంత అనుమానం ఉండేది. పాట్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం పిచ్చ క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ ని చూసేందుకు యూపీ, బీహార్ కి చెందిన ఫ్యాన్స్ లక్షల్లో పోటెత్తారు. పుష్ప 2ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. దాంతో టీమ్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

    ఇక విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ప్రమోషన్స్ జోరు మరింత పెంచారు. దానిలో భాగంగా శ్రీలీల నటించిన ఐటెం సాంగ్ విడుదల చేస్తున్నారు. కిస్సిక్.. అనే ఐటెం నెంబర్ శ్రీలీల, అల్లు అర్జున్ పై తెరకెక్కించారు. పుష్ప పార్ట్ 1లో సమంత నటించిన ‘ఊ అంటావా మామా’ భారీ ఆదరణ దక్కించుకుంది. సమంత బోల్డ్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలో శ్రీలీలకు కిస్సిక్ సాంగ్ ఛాలెంజ్ అని చెప్పాలి.

    శ్రీలీల బేసిక్ గా ప్రొఫెషనల్ డాన్సర్. కాబట్టి సమంతకు మించిన పెర్ఫార్మన్స్ ఇస్తుందనే నమ్మకం ఉంది. అలాగే కెరీర్లో ఫస్ట్ టైం శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తుంది. ఆమె అతికష్టం మీద ఒప్పుకున్నారనే టాక్ ఉంది. అలాగే పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ రాబట్టిందట. ఇక కిస్సిక్ సాంగ్ నవంబర్ 24న విడుదల కానుంది. కాగా నేడు ప్రోమో విడుదల చేశారు. ప్రోమోలో శ్రీలీల లుక్ హైలెట్ గా ఉంది.

    కిస్సిక్ సాంగ్ ని లోతిక, శుభ్లాష్ని పాడారు. రాకీబ్ ఆలం సహితం అందించారు. ఇక పుష్ప 2 చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కిస్సిక్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. కాగా పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 19కి వాయిదా పడిదంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై టీమ్ స్పందించలేదు.

    అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ ప్రధాన విలన్. జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 నిర్మించారు.