https://oktelugu.com/

Bigg Boss Sonia : పెళ్ళైన వ్యక్తితో బిగ్ బాస్ సోనియా నిశ్చితార్థం, ఆమెకు కాబోయే భర్త ఎవరు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల నిశ్చితార్థం నిరాడంబరంగా ముగిసింది. ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : November 23, 2024 / 11:27 AM IST

    Bigg Boss Sonia is engaged to a married man, who is her future husband?

    Follow us on

    Bigg Boss Sonia : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల నిశ్చితార్థం నిరాడంబరంగా ముగిసింది. ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోనియాకు కాబోయే భర్తకు ఆల్రెడీ పెళ్లయిందని సమాచారం. రెండో వివాహంగా సోనియా మెడలో తాళి కట్టనున్నాడు. ఇంతకీ ఎవరీ వ్యక్తి?
     
    జార్జ్ రెడ్డి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన తెలుగు అమ్మాయి సోనియా ఆకుల.. అనంతరం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, దిశా ఎన్కౌంటర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ ఫేమ్ తో సోనియాకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అవకాశం వచ్చింది. సోనియా ఆకుల ప్రవర్తన హౌస్లో వివాదాస్పదం అయ్యింది. నిఖిల్, పృథ్వి రాజ్ లతో ఆమె అత్యంత సన్నిహితంగా ఉండేది. వారిద్దరితో సోనియా ఆకుల బాడీ లాంగ్వేజ్ అసభ్యకరంగా తోచింది. 
     
    అలాగే నిఖిల్, పృథ్వి గేమ్ ని సోనియా ఆకుల ప్రభావితం చేస్తుంది. ఆమె మాటల ఆధారంగా వారి నిర్ణయాలు ఉంటున్నాయనే విమర్శలు తలెత్తాయి. సోషల్ మీడియాలో సోనియా ఆకులపై ట్రోలింగ్ నడిచింది. హౌస్లో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుపుతుందని ట్రోల్ చేశారు. సోనియా మీద నెగిటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆమె పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చారు. యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సోనియాను తప్పుగా చూపిస్తున్నారని ఆవేదన చెందారు. నిఖిల్, పృథ్విలను సోనియా బ్రదర్స్ కోణంలో చూస్తుంది. ఆ విషయం సోనియా లైవ్ లో చెప్పింది అన్నారు. 
     
    ఆల్రెడీ సోనియాకు పెళ్లి కుదిరింది. డిసెంబర్ లో వివాహం జరగాల్సి ఉంది. ఈ లోపు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అత్తమామలు, కాబోయే భర్త అనుమతితో పాల్గొందని వివరణ ఇచ్చారు. సోనియా ఆకుల పెద్దగా రాణించలేదు. విపరీతమైన నెగిటివిటీ నేపథ్యంలో 4వ వారం ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చిన సోనియా డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. కాబోయే భర్తతో కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ముందుగా చెప్పినట్లే ప్రియుడితో ఆమె పెళ్ళికి సిద్దమైంది. 
     
    సోనియా ఆకుల లవర్ పేరు యష్ పాల్. ఆయనతో సోనియాకు చాలా కాలంగా పరిచయం ఉంది. అది ప్రేమగా మారింది. యష్ పాల్-సోనియా నవంబర్ 21 గురువారం ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. నిరాడంబరంగా ఈ వేడుక ముగిసినట్లు సమాచారం. సోనియా ఎంగేజ్మెంట్ మేటర్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక యష్ పాల్ కి ఆల్రెడీ పెళ్లైంది. మొదటి భార్యతో ఆయన విడిపోయారు. రెండో వివాహంగా సోనియా ఆకులను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోనియా ఆకులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.