Pushpa 2 : పుష్ప 2 టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో నార్త్ లో పుష్ప 2 వసూళ్లు కుమ్మేయడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ ని మార్చేసిన చిత్రం. 2021లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచన మొదట్లో చేయలేదు. షూటింగ్ పూర్తయ్యాక రాజమౌళి సలహాతో రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఆయన ఆలోచన చక్కని ఫలితం ఇచ్చింది. పుష్ప పార్ట్ 1 విడుదలైన విజయం అందుకుంది.
ముఖ్యంగా నార్త్ ఇండియాలో లాభాలు పంచింది. పుష్ప చిత్రాన్ని నార్త్ లో పెద్దగా ప్రమోట్ చేయలేదు. దాంతో మొదటి రోజు కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు మాత్రమే అందుకుంది . మెల్లగా పుంజుకున్న చిత్రం లాంగ్ టర్మ్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. నార్త్ ఆడియన్స్ కి పుష్ప తెగ నచ్చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. పుష్ప హిందీ వెర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
పుష్ప 2 టీజర్ ఏప్రిల్ 8న విడుదల చేశారు. అల్లు అర్జున్ జన్మదినం కానుకగా విడుదలైన ఈ టీజర్ కి విశేష ఆదరణ దక్కింది. జాతరలో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ రౌడీలను ఇరగదీస్తున్నాడు. ఆయన గెటప్, వాకింగ్, మాస్ మేనరిజం కట్టిపడేశాయి. పుష్ప 2 టీజర్ కి నార్త్ మీడియా ఫిదా అయ్యింది. అందరూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. పుష్ప 2 హిందీ వెర్షన్ మొదటి రోజు రూ. 40-50 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు. అలాగే లాంగ్ రన్ లో రూ. 500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
పుష్ప 2 దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రూ. 1000 కోట్ల వసూళ్ల టార్గెట్ గా విడుదల చేయనున్నారు. పుష్ప 2 చిత్రానికి ఉన్న డిమాండ్ రీత్యా అన్ని భాషల్లో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కానుంది..