https://oktelugu.com/

Pushpa 2′ special screening : మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకు ‘పుష్ప 2’ స్పెషల్ స్క్రీనింగ్..నిర్మాతలు ఎక్కడ చూపించబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని స్టార్ హీరోలందరికీ స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించే పనిలో ఉన్నాడు. ముందుగా ప్రతీ సినిమాని ప్రోత్సహించే సూపర్ స్టార్ మహేష్ బాబు కి చూపించే ప్రయత్నం లో ఉన్నారు మేకర్స్.

Written By:
  • Vicky
  • , Updated On : December 5, 2024 / 08:18 PM IST

    Pushpa 2' special screening

    Follow us on

    Pushpa 2′ special screening : మూడేళ్ళుగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ప్: ది రూల్’ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై మొదటి ఆట నుండే మంచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రాజెక్ట్స్ కి యావరేజ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. అలాంటిది ఈ రేంజ్ సూపర్ హిట్ టాక్ వస్తే ఓపెనింగ్స్ ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి. అలాంటి ఓపెనింగ్ వసూళ్లే ఈ సినిమాకి కూడా వచ్చాయి. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా ప్రతీ భాషలోనూ ఈ చిత్రానికి కళ్ళు చెదిరే వసూళ్లు నమోదు అవుతున్నాయి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి కచ్చితంగా 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకుంటున్నారు.

    ఇది కాసేపు పక్కన పెడితే మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని స్టార్ హీరోలందరికీ స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించే పనిలో ఉన్నాడు. ముందుగా ప్రతీ సినిమాని ప్రోత్సహించే సూపర్ స్టార్ మహేష్ బాబు కి చూపించే ప్రయత్నం లో ఉన్నారు మేకర్స్. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి షూటింగ్ ప్రిపరేషన్స్ కోసం జర్మనీ లో ఉన్నాడు. అక్కడే ఆయనకీ స్క్రీనింగ్ వేసి చూపించబోతున్నారట. ఈ సినిమా చూసిన వెంటనే మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ నుండి ‘పుష్ప 2’ చిత్రం గురించి ట్వీట్ పడనుంది. మహేష్ బాబు ఈ చిత్రానికే కాదు, ప్రతీ సినిమాకి తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఉంటాడు. చిన్న హీరోల దగ్గర నుండి, తన తోటి స్టార్ హీరోల సినిమాల వరకు ఎలాంటి బేషజాలం లేకుండా మనస్ఫూర్తిగా మాట్లాడేవాడు సూపర్ స్టార్. రీసెంట్ గా ఆయన ‘దేవర’ చిత్రానికి రెస్పాన్స్ ఇవ్వనందుకు ఎన్టీఆర్ అభిమానుల నుండి కాస్త అసంతృప్తి వ్యక్తమైంది.

    ఇది ఇలా ఉండగా ‘పుష్ప 2’ మేకర్స్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూడా స్పెషల్ షో వేసి చూపించే పనిలో ఉన్నారట. మంగళగిరి లోని తన నివాసం లోనే క్యూబ్ ద్వారా స్క్రీనింగ్ చేయించబోతున్నారట. ఆయన నుండి కూడా ఈ సినిమా గురించి ట్వీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ ఏర్పడిందని సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ఒక వార్త ప్రచారంలో ఉంది. అభిమానులు ఈ విషయమై ప్రతీరోజు ఫ్యాన్ వార్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నుండి ఈ సినిమా గురించి ట్వీట్ పడితే అభిమానుల మధ్య ఉన్న గ్యాప్, అపార్థాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి స్పెషల్ స్క్రీనింగ్ విషయంపై