Niharika Konidala : ఈమధ్య కాలంలో సెలెబ్రిటీలు పెళ్లి చేసుకుంటున్న వార్తల కంటే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలే వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకున్న రెండు మూడేళ్లకే విడిపోతున్నారు. పోనీ వీళ్ళ మధ్య అనేక విషయాల్లో ఏకాభిప్రాయం లేకపోయుండొచ్చు, అందుకే విబేధాలు వచ్చి విడిపోయుండొచ్చు అని అనుకుందాం. కానీ పెళ్లి చేసుకొని పాతికేళ్ల దాంపత్య జీవితం గడిపిన వాళ్ళు కూడా ఇప్పుడు విడాకులు తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఏఆర్ రెహమాన్ దంపతులు, తమిళ హీరో ధనుష్ దంపతులు, జయం రవి దంపతులు ఈ క్యాటగిరీ కి చెందిన వాళ్ళే. ఇకపోతే మెగా ఫ్యామిలీ లో ఎక్కువగా ఇలాంటి విడాకుల వ్యవహారాలు జరిగాయి. ముఖ్యంగా చిరంజీవి చిన్న కూతురికి రెండు సార్లు వివాహం జరిగితే, రెండు సార్లు కూడా విడాకులు జరిగాయి. ప్రస్తుతం ఆమె తన పిల్లలతో సోలో జీవితాన్ని గడుపుతుంది. అదే విధంగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల విషయంలో కూడా జరిగింది.
చైతన్య అనే వ్యక్తి తో నిహారిక వివాహం ఎంత అట్టహాసం గా జరిగిందో ఇప్పటికీ మరచిపోలేము. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తే మెగా ఫ్యాన్స్ కడుపు నిండిపోతుంది. అంత ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి వివాహం చేసుకున్న ఈ జంట కేవలం రెండేళ్లకే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటో తెలియదు కానీ, వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడం మెగా అభిమానులకు అసలు ఏమాత్రం నచ్చలేదు. విడాకులు తీసుకున్న తర్వాత నాగబాబు ఇంట్లోనే ఉంటున్న నిహారిక, తన సోలో లైఫ్ ని చాలా ఆనందంగా లీడ్ చేస్తుంది. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈమె ఒక ప్రముఖ యంగ్ హీరోతో ప్రస్తుతం డేటింగ్ లో ఉందని, తావరలోనే ఈమె అతన్ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అతను ఎవరు, ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక నిహారిక కొణిదెల కెరీర్ విషయానికి వస్తే, ఈమె తొలుత ఒక యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. యాంకర్ గా మంచి మార్కులు కొట్టేసిన ఈమె ప్రముఖ యంగ్ హీరో నాగ శౌర్య తో కలిసి ‘ఒక మనసు’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఈమె నటనకి గుడ్ బాయ్ చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు నిర్మించిన ఆమె సక్సెస్ లను అందుకోలేకపోయింది. కానీ విడాకుల తర్వాత ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. నిర్మాతగా నిహారిక కి కలలో కూడా ఊహించనంత లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరికొన్ని చిత్రాలను నిర్మించేందుకు సిద్ధం అవుతుంది నిహారిక.