Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : రూల్’ ఫీవర్ మొదలైంది. డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న రాత్రి ప్రారంభం అయ్యింది. బుకింగ్స్ ట్రెండ్ బాగానే ఉంది కానీ, ‘సలార్’, ‘దేవర’ చిత్రాల రేంజ్ ట్రెండ్ మాత్రం లేదనే చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ ని 177 లొకేషన్స్ లో, 557 షోస్ తో ప్రారంభించగా, 2142 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు 54 వేల డాలర్లు వచ్చాయట. ‘దేవర’ చిత్రానికి ప్రారంభం లో కేవలం 19 లొకేషన్స్ లో 52 షోస్ తో బుకింగ్స్ ప్రారంభించగా, 2407 టిక్కెట్లు అమ్ముడుపోయి, 75 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
దాంతో పోలిస్తే యావరేజ్ పుష్ప కి చాలా తక్కువగా ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘సలార్’ ని అప్పట్లో సెప్టెంబర్ 22 వ తారీఖున విడుదల చేయాలని మేకర్స్ అనుకున్న సంగతి తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ ని నెల రోజుల ముందే ప్రారంభించారు. ప్రారంభంలో 222 లొకేషన్స్ తో 643 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, 8100 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ అయితే ఏకంగా 2 లక్షల 32 వేల రూపాయిలు వచ్చాయట. పుష్ప చిత్రాన్ని కూడా ఇదే స్థాయి షోస్ కౌంట్ తో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలెట్టారు. ‘సలార్’ తో పోలిస్తే పావు శాతం వసూళ్లు మాత్రమే ‘పుష్ప 2’ కి దక్కింది. అనుకున్న స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోకపోవడం తో బయ్యర్స్ కాస్త నిరాశకి గురయ్యారు. అయితే హిందీ లో మాత్రం ‘పుష్ప 2 ‘ అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడి స్టార్ హీరోలకు మించి ఉంది.
పుష్ప కి అమ్ముడుపోయిన 2142 టికెట్స్, 200 టికెట్స్ హిందీ వెర్షన్ వి అవ్వడం గమనార్హం. సినిమా విడుదలకు 33 రోజులు ఉన్న సమయంలో ఈ స్థాయి టిక్కెట్లు ఇప్పటి వరకు ఏ సినిమాకి అమ్ముడుపోలేదట. షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘జవాన్’ చిత్రానికి విడుదలకు 17 రోజుల ముందు 7995 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమా తర్వాత పుష్ప కి అత్యధికంగా 200 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది టాప్ 2 గా పరిగణిస్తున్నారు బాలీవుడ్ ట్రేడ్. మిగిలిన చిత్రాలైన ‘ఎనిమల్’, ‘సలార్’, ‘కల్కి’, ‘డుంకీ’ వంటి చిత్రాలకు 17 రోజులకు ముందు వంద లోపే టికెట్స్ అమ్ముడుపోయాయట. దీనిని బట్టి పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. టాక్ పాజిటివ్ గా వస్తే, ఆకాశమే హద్దు అనే విధంగా హిందీ వసూళ్లు ఉంటాయి. హిందీ + తెలుగు కలిపి నార్త్ అమెరికా/ కెనడా లో ఈ సినిమాకి 30 మిల్లియన్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.