https://oktelugu.com/

Devara: ‘దేవర’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఆ రెండు ప్రాంతాల్లో భారీ నష్టాలు!

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం 200 కి పైగా సెంటర్స్ లో 50 రోజులు ఆడబోతుందట. దీపావళి రోజున కూడా 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఎట్టకేలకు థియేట్రికల్ రన్ ని ముగించుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 08:38 PM IST

    Devara Movie collections

    Follow us on

    Devara: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, నెల రోజుల వరకు నాన్ స్టాప్ గా థియేట్రికల్ షేర్స్ ని రాబడుతూ బాక్స్ ఆఫీస్ వీరవిహారం చేసింది ఈ చిత్రం. ఇప్పటికీ పలు ప్రాంతాలలో డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబడుతూ 50 రోజుల వైపు దూసుకుపోతుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం 200 కి పైగా సెంటర్స్ లో 50 రోజులు ఆడబోతుందట. దీపావళి రోజున కూడా 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఎట్టకేలకు థియేట్రికల్ రన్ ని ముగించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలవారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు ఒకసారి చూద్దాము.

    ముందుగా నైజాం ప్రాంతం విషయానికి వస్తే, ఇక్కడ ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అదే విధంగా సీడెడ్ లో 28 కోట్లు, ఉత్తరాంధ్ర లో 16 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్ల 20 లక్షల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్లు, గుంటూరు జిల్లాలో 12 కోట్లు, కృష్ణ జిల్లాలో 7 కోట్ల 20 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 5 కోట్ల 30 లక్షల రూపాయిలు, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 134 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 112 కోట్ల రూపాయలకు జరగగా, నిర్మాతకు 22 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ప్రీమియర్స్ లోనే 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయిల గ్రాస్, 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే కర్ణాటక 16 కోట్ల రూపాయిలు, తమిళనాడు లో 3 కోట్ల రూపాయిలు, కేరళలో కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ లో ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 197 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 396 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఎలాంటి సూపర్ హిట్ సినిమాకి అయినా కొన్ని ప్రాంతాలలో నష్టాలు తప్పవు. అలా ‘దేవర’ చిత్రానికి తమిళనాడు, కేరళ ప్రాంతాలలో భారీ నష్టాలు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. తమిళనాడు లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటాలంటే 10 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి, కానీ దేవర కి కేవలం 3 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది. అదే విధంగా కేరళ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి 4 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉండగా, కేవలం కోటి రూపాయిల షేర్ ని రాబట్టింది