Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఎంత హీట్ వాతావరణం మధ్య నడిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన గొడవ పెద్ద చర్చకు దారి తీసింది. ఒక క్రూర మృగం లాగా విచక్షణ కోల్పోయి గేమ్స్ ఆడిన నిఖిల్ ని ఈ వీకెండ్ లో నాగార్జున గట్టిగా నిలదీస్తాడని అందరూ అనుకున్నారు. అందుకే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూసారు. మొత్తానికి కాసేపటి క్రితమే ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో నాగార్జున అంచనాలకు తగ్గట్టుగానే హోస్టింగ్ చేశాడా లేదా అనేది చూద్దాం. ముందుగా ఆయన ‘పుడింగి ప్రేరణ’ అని ప్రేరణ ఫోటో ని చింపుతాడు. మాటలు జాగ్రత్త అని అందరితో చెప్తూ ఉంటావ్, నువ్వు అది కరెక్ట్ గా పాటిస్తున్నావా? అని ప్రేరణ ని అడుగుతాడు నాగార్జున. అప్పుడు నయనీ పావని మధ్యలో కలగచేసుకొని ‘సార్..హ్యాట్ నామినేషన్ అప్పుడు కూడా ఆమె నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు ‘పో’ అని పొగరుగా మాట్లాడింది’ అని అంటుంది.
అప్పుడు ప్రేరణ దానికి వివరణ ఇస్తుండగా ‘ప్రేరణ మధ్యలో మాట్లాడకు’ అని సీరియస్ గా నాగార్జున వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు నిఖిల్ ని ఆమె బూతులు తిట్టిన వీడియో ని ప్లే చేస్తాడు నాగార్జున. దీనికి సమాధానం ఏమి చెప్తావు అని ఆయన అడగగా, దానికి ఆమె మాట్లాడుతూ ‘ఆ సమయంలో ఎమోషన్స్ చాలా ఓవర్ రైడ్ అవ్వడం వల్ల నోరు జారింది సార్’ అని అంటుంది. ‘అంటే నీ దాకా వస్తే ఎమోషన్స్ ఓవర్ రైడ్..అదే వేరే వాళ్లకు వస్తే మాత్రం కాదంటావ్’ అని అంటాడు నాగార్జున. ఇక ఆ తర్వాత నిఖిల్ ఫోటో ని చింపుతూ ‘హౌస్ మేట్స్ నిన్ను ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయిపోతావా?’ అని చెప్పి, నిఖిల్ గేమ్ ఆడిన తీరుని చూపిస్తూ వీడియో ని ప్లే చేస్తాడు నాగార్జున. సంచాలక్ హరితేజ నీకు చెప్తూనే ఉంది, కానీ నువ్వు ఆపలేదు అని నాగార్జున అనగా, ఆమె చెప్పింది నాకు వినపడలేదు అని అంటాడు నిఖిల్. ఇక చివర్లో గౌతమ్ తో మాట్లాడుతూ నిఖిల్ కి ఆయనకు మధ్య జరిగిన గొడవ వీడియో ప్లే చేస్తాడు.
దీనికి గౌతమ్ వివరణ ఇస్తూ ‘కోపం లో ఎదో బ్లాబెర్ చేసినట్టు ఉంది కానీ, కావాలని నేనేమి అతన్ని తిట్టలేదు సార్’ అని అంటాడు. బ్లాబెర్ చేయడంలో సైలెంట్ ఎందుకు?, చాలా తెలివిగా వాడాల్సిన పదం సైలెంట్ గా వాడేసావ్ అని అంటాడు నాగార్జున. అప్పుడు గౌతమ్ ‘నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను కావాలని ఏ పదం ఉపయోగించలేదు సార్. నేను చేయని తప్పుని ఒప్పుకోను సార్, ఒకవేళ అది నిజమైతే ఇప్పుడే హౌస్ నుండి వెళ్ళిపోతాను సార్’ అని అంటాడు. అప్పుడు నాగార్జున ‘గౌతమ్ కేవలం బ్లాబెర్ చేసాడు అని హౌస్ లో ఎంతమంది నమ్ముతున్నారో చేతులెత్తండి, అలాగే ఆడియన్స్ కూడా’ అని నాగార్జున అడగగా, అందరూ సైలెంట్ గా ఉంటారు. హౌస్ మేట్స్ నమ్మడం లేదు, ఇక్కడున్న ఆడియన్స్ కూడా నమ్మడం లేదు, ఇక బయట ఆడియన్స్ కి ఎలా అర్థం అయ్యుంటాడో నువ్వే ఊహించుకో అని అంటాడు నాగార్జున. ఇక తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.