Pushpa 2: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎన్ని సినిమాలు వస్తున్న కూడా ఒక్క సినిమా మీద మాత్రం విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ప్రతి ఒక్క అభిమాని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడనే విషయం సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇంతకీ అది ఏ సినిమా అంటే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2…
ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ మేకర్స్ ఇంతకు ముందే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా నుంచి వస్తున్న సాంగ్స్ గాని, టీజర్ గానీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఇక ఒకదానికి మించి మరోకటి ఉండడంతో ఈ సినిమా హైప్ అనేది తారాస్థాయిలో ఉందనే చెప్పాలి. అందుకోసమే ఈ సినిమాను ఎలాగైనా సరే భారీ సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాలని సినిమా దర్శకుడు సుకుమార్ భావిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా “పుష్ప పుష్ప పుష్ప” అంటూ సాగే టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది.
ఇక దానికి విపరీతమైన ఆదరణ అయితే దక్కింది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పుష్ప 2 సినిమా నుంచి సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక మే చివరి వారంలో ఈ సినిమా సాంగ్ ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేయబోయే సాంగ్ అల్లు అర్జున్ రష్మిక మందాన మధ్యన వచ్చే ఒక మెలోడీ సాంగ్ గా తెలుస్తుంది.
ఇక ఈ సాంగ్ కూడా అద్భుతంగా ఉంటే మాత్రం ఈ సినిమా హైప్ అనేది ఎవరు టచ్ చేయని రేంజ్ లోకి వెళ్ళిపోతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుపుకుంది. ఇక 200 కోట్లు పెట్టి బాలీవుడ్ వాళ్లు ఈ సినిమా రైట్స్ ను దక్కించుకున్నారు అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…