https://oktelugu.com/

Feline Species : సింహం నుంచి ప్యూమా దాకా ఈ పిల్లి జాతుల గురించి తెలుసా?

ఈ పులి ధ్రువపు ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరించగలుగుతుంది. దీనిని పర్వతపు ప్రాంత దయ్యం అని కూడా పిలుస్తారు. దీని వేటాడే విధానం ఇతర పులులతో పోల్చితే పూర్తి విభిన్నంగా ఉంటుంది.

Written By: NARESH, Updated On : May 6, 2024 11:27 am
Feline Species

Feline Species

Follow us on

Feline Species : మన ఇంట్లో పిల్లి ఉంటే ఎలుకలకు హడల్. పందికొక్కులకు బెదురు. అదే అడవిలో పులి ఉంటే జింకల నుంచి మొదలు పెడితే ఇతర జంతువుల వరకు నిత్యం ప్రాణ భయమే.. వాస్తవానికి అడవుల్లో ఉన్న క్రూర మృగాలైన పులి, సింహం, జాగ్వార్, మచ్చల పులి, ప్యూమా, ధ్రువపు ప్రాంతపు పులి, బెంగాల్ టైగర్, చీతా… ఇవన్నీ పులి జాతికి చెందినవే. ఆయా భౌగోళిక ప్రాంతాల వైవిధ్యం వల్ల అవి విభిన్నంగా ఉన్నాయి. ఇంతకీ వాటి లక్షణాలు ఏమిటో, వాటి మనుగడ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.

asiatic-lions-died

asiatic-lions-died

ఆసియా సింహం

ఈ సింహాలు చూసేందుకు చాలా బలంగా ఉంటాయి. భారీ దేహాన్ని కలిగి ఉంటాయి. నిండుగా జూలుతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సబ్ సహారా ప్రాంతాల్లో ఈ సింహాలు ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. మనదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అటవీ ప్రాంతంలో ఈ సింహాలు ఉన్నాయి. ఏటికేడు అడవుల సంఖ్య తగ్గడం, వాతావరణ కాలుష్యం, భౌగోళిక మార్పులు సింహాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Royal_Bengal_Tiger

బెంగాల్ పులి

పశ్చిమ బెంగాల్లోని సుందర్ బన్ ఏరియాలో విస్తరించి ఉన్న అడవుల్లో ఈ పులులు ఉంటాయి. మిగతా పులుల కంటే ఇవి కొంచెం పొడుగ్గా ఉంటాయి. వేటాడే విధానంలో వీటికివే సాటి. ఎంత పెద్ద జంతువునైనా ఇవి వేటాడేస్తాయి.

chirutha

chirutha

చిరుత

ఒకప్పుడు మనదేశంలో ఇవి చాలా అడవుల్లో కనిపించేవి. వేటగాళ్ల ఉచ్చులకు బలైపోయాయి. అడవుల సంఖ్య తగ్గడం, వీటి ఆవాసాలకు ముప్పు ఏర్పడటంతో క్రమంగా వీటి సంఖ్య తగ్గిపోవడం ప్రారంభించింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే ఇవి పరిమితమైపోయాయి. సరైన ఆహారం లభించక కొన్నిసార్లు ఇవి జనావాసాలకు వస్తున్నాయి.

మచ్చల పులి

దక్షిణ మండల ఆగ్నేయాసియా ప్రాంతాలలోని ఉష్ణ మండల అడవుల్లో ఈ పులి ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో వీటి సంఖ్య వేలల్లో ఉండగా.. ఇప్పుడది వందలకు పడిపోయింది. అడవుల సంఖ్య తగ్గడం, ఆహారం సక్రమంగా లభించకపోవడం, వేటగాళ్ల ఉచ్చులకు బలి కావడంతో వీటి సంఖ్య క్రమేపి తగ్గుతున్నది.

jaguar

జాగ్వార్

పులి జాతులకు సంబంధించిన వాటిల్లో ఇది మూడవ అతిపెద్దది. ఒకప్పుడు అర్జెంటీనా నుంచి మొదలుపెడితే అమెరికా వరకు ఈ పులులు కనిపించేది. ప్రస్తుతం అమెజాన్ అడవులకు మాత్రమే పరిమితమైపోయాయి.

భారతీయ చిరుత పులి

ఈ చిరుత పులి నల్లమల, గిర్, ఇంకా కొన్ని అటవీ ప్రాంతాలలో ఉంటుంది. ఈ పులులకు ఒంటిపై ప్రత్యేక చారలు ఉంటాయి. ప్రతీ పులి విభిన్నమైన చారలు కలిగి ఉంటుంది. దీని జన్యు వైవిధ్యం వల్లే ఇలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Puma

ప్యూమా

ఇది పులుల్లో ఒక జాతి. దక్షిణ అమెరికా నుంచి దక్షిణ కెనడా వరకు విస్తృతంగా వృద్ధి చెందుతోంది. వేగంగా పరిగెత్తగల సామర్థ్యం, అవలీలగా జంతువులను వేటాడడం.. ఈ పులి ప్రత్యేక లక్షణాలు. మనగడపరంగా ఎటువంటి ముప్పు లేకపోయినప్పటికీ.. ఈ పులులు వేటగాళ్ల ఉచ్చులకు తరచూ బలైపోతున్నాయి.

ధ్రువపు పులి

దీనిని స్నో టైగర్ అని పిలుస్తుంటారు. దీని శరీరం పై ఉన్న రోమాలు ఎటువంటి ప్రతికూల వాతావరణ్ణానైనా తట్టుకునేలా ఉంటాయి. అందువల్ల ఈ పులి ధ్రువపు ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరించగలుగుతుంది. దీనిని పర్వతపు ప్రాంత దయ్యం అని కూడా పిలుస్తారు. దీని వేటాడే విధానం ఇతర పులులతో పోల్చితే పూర్తి విభిన్నంగా ఉంటుంది.