Pushpa 2: అల్లు అర్జున్ స్టామినా ఏమిటో పుష్ప 2 తో రుజువైంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా పుష్ప 2 నమోదు చేస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సౌత్ హీరో అల్లు అర్జున్ బాలీవుడ్ బడా స్టార్స్ రికార్డ్స్ మొత్తం పుష్ప 2 తో లేపేశాడు. ఫస్ట్ డే హైయెస్ట్, ఫాస్టెస్ట్ 300 కోట్లు రికార్డులను పుష్ప 2 హిందీ వెర్షన్ సొంతం చేసుకుంది. రూ. 500 కోట్ల వసూళ్లను అధిగమించిన పుష్ప 2… బాహుబలి 2 హిందీ వెర్షన్ రికార్డు బ్రేక్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి పుష్ప 2 రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సౌత్ లో పుష్ప 2 వసూళ్లు కొంచెం నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి. నార్త్ లో మాత్రం అదే జోరు కొనసాగుతుంది. సెకండ్ సండే పుష్ప 2 హిందీ రూ. 54 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. వర్కింగ్ డే కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. బాహుబలి 2 అత్యధిక వసూళ్లను పుష్ప 2 అధిగమించాలి అంటే మరో రూ. 400 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
కాగా పుష్ప 2 ఓటీటీ విడుదల కోసం ఓ వర్గం ఎదురు చేస్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైతే మరోసారి చూసి ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాధారణంగా మూవీ విడుదలైన నాలుగు వారాల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తారు. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్న సినిమాల స్ట్రీమింగ్ కొంత ఆలస్యం అవుతుంది. పుష్ప 2 సంచలన విజయం నమోదు చేసిన నేపథ్యంలో 40 నుండి 50 రోజుల తర్వాతే ఓటీటీ రిలీజ్ అంటున్నారు.
అంటే జనవరి మూడో వారంలో పుష్ప 2 ఓటీటీలో అందుబాటులోకి రానుందట. అయితే ముందు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమ్ చేస్తారట. హిందీ వెర్షన్ ఆలస్యం అవుతుందట. నార్త్ లో హిట్ టాక్ వచ్చిన చిత్రాలకు లాంగ్ రన్ ఉంటుంది. ఏడెనిమిది వారాలు కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుంది. నార్త్ లో పుష్ప 2 వసూళ్ల ప్రభంజనం కొనసాగుతుంది. అందుకే హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యం కానుందట.