Devara Vs Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈనెల 27వ తేదీన ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మరి ఇలాంటి క్రమంలో దేవర పుష్ప 2 ఈ రెండు సినిమాల మధ్య మొదటి నుంచి కూడా చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఎవ్వరి అభిమానులు వాళ్ళ హీరోని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా భారీ విజయాన్ని సాధించబోతుంది. ఏ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టబోతుంది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. నిజానికి దేవర వర్సెస్ పుష్ప 2 గా సాగుతున్న ఈ పోటీలో రెండు సినిమాల టార్గెట్ కూడా ఒకటే…ఇక ఈ రెండు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇందులో ఏ సినిమా వెయ్యి కోట్లను కలెక్ట్ చేస్తుంది. ఏ సినిమా అంత భారీ కలెక్షన్లు రాబట్టలేక చతికలబడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రతి సినిమా విషయంలో మన హీరోలు భారీ అంచనాలను పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్లకు నచ్చిన కథని వాళ్లకు నచ్చిన దర్శకుడు తెరకెక్కిస్తున్నప్పుడు ఆటోమేటిగ్గా సినిమా వాళ్లకి నచ్చుతుంది. కానీ ఆడియెన్స్ కి కూడా నచ్చినప్పుడే కదా సినిమా అనేది సక్సెస్ అయ్యేది… అందువల్లే కొన్ని సినిమా పరిస్థితి కూడా అలానే తయారవుతుంది.
ఇక దేవర సినిమాతో ఎన్టీఆర్ ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక పుష్ప మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో మొదటి పార్ట్ మీద ఉన్న మైలేజ్ సెకండ్ పార్ట్ కి చాలావరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ పెట్టుకున్న కొన్ని విభేదాల వల్ల సినిమా మీద అంచనాలు తగ్గడమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక తెలుగులో మినహాయిస్తే బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమాకి భారీ క్రేజ్ అయితే ఉంది. అక్కడ భారీ సక్సెస్ ని కూడా సాధించే అవకాశాలైతే ఉన్నాయి… మరి రెండు సినిమాల్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…