Goat Movie Twitter Talk: గోట్ మూవీ ట్విట్టర్ టాక్: దళపతి విజయ్ చివరి చిత్రం ఇలా ఉంటుందని ఊహించి ఉండరు, ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

త్వరలో పొలిటికల్ గా బిజీ కానున్న విజయ్ చివరి చిత్రంగా గోట్ చేశారు. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. గోట్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Written By: S Reddy, Updated On : September 5, 2024 8:55 am

Goat Movie Twitter Talk

Follow us on

Goat Movie Twitter Talk: టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తున్నాడు దళపతి విజయ్. ఆయన గత చిత్రం లియో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.; అయినప్పటికీ రూ. 600 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఇక విజయ్ నుండి వస్తున్న చివరి చిత్రం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). రాజకీయాల్లోకి విజయ్ క్రియాశీలకంగా మారాడు. తమిళ వెట్రి కజగం పేరుతో పార్టీని స్థాపించారు. ఇటీవల జెండా ఆవిష్కరణ కూడా చేశారు. పొలిటికల్ ఎంట్రీ అనంతరం సినిమాలు చేయనని విజయ్ తెలిపారు. కాబట్టి ఆయన చివరి చిత్రం గోట్ కావచ్చు.

గోట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. విజయ్ డ్యూయల్ రోల్ చేశారు. గోట్ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించారు. ప్రభుదేవా, ప్రశాంత్, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరి, జయరామ్, వైభవ్, యోగిబాబు కీలక రోల్స్ చేశారు. గోట్ ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి గోట్ అంచనాలు అందుకుందా?

ఆడియన్స్ అభిప్రాయంలో గోట్ మూవీ ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. ఆడియన్స్ కొంతమేర ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అయితే నిడివి ఎక్కువైన భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో మరొక హైలెట్ చెప్పాలంటే మ్యూజిక్, బీజీఎమ్. గోట్ మూవీ కి సంగీతం ప్లస్ అయ్యింది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ కోసం మంచి సెటప్ దర్శకుడు ఏర్పాటు చేశాడు.

సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. సెకండ్ హాఫ్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసిన దర్శకుడు అది కంటిన్యూ చేయలేకపోయాడు. అక్కడక్కడా ఆకట్టుకునే ట్విస్ట్స్ మినహాయిస్తే మూవీ సాగదీతకు గురైన భావన కలుగుతుంది. కొన్ని చోట్ల విసుగు కలుగుతుంది. గోట్ మూవీలో విజయ్ క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా యంగ్ రోల్ ఫ్యాన్స్ కి ఫీస్ట్. మూవీని ఆయన భుజాలపై వేసుకుని నడిపించాడు. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. లోపాలను పక్కన పెడితే… గోట్ మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.