https://oktelugu.com/

పూరి విశ్లేషణ: ధనవంతులు దేశం విడిచి ఎందుకు పోతున్నారు?

టాలీవుడ్లో డ్యాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్మాథ్ కు మంచి పేరు ఉంది. దర్శకుడు పూరీ టాలీవుడ్ తోపాటు బాలీవుడ్లోనూ పలు సినిమాలు తీసి సూపర్ హిట్టు విజయాలు అందుకున్నాడు. సీనియర్, యంగ్ హీరోలందరికీ పూరి జగన్మాథ్ సినిమాలు తీసి మంచి విజయాలు అందుకున్నాడు. కొంతకాలంగా సక్సస్ దూరంగా ఉన్న పూరీ ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. Also Read: ప్రభాస్ ను ఫాలో అవుతున్న ‘కేజీఎఫ్’ హీరో.. రెమ్యూనరేషన్ ఎంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 01:11 PM IST

    Geniuses do not get married: Puri comments

    Follow us on


    టాలీవుడ్లో డ్యాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్మాథ్ కు మంచి పేరు ఉంది. దర్శకుడు పూరీ టాలీవుడ్ తోపాటు బాలీవుడ్లోనూ పలు సినిమాలు తీసి సూపర్ హిట్టు విజయాలు అందుకున్నాడు. సీనియర్, యంగ్ హీరోలందరికీ పూరి జగన్మాథ్ సినిమాలు తీసి మంచి విజయాలు అందుకున్నాడు. కొంతకాలంగా సక్సస్ దూరంగా ఉన్న పూరీ ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

    Also Read: ప్రభాస్ ను ఫాలో అవుతున్న ‘కేజీఎఫ్’ హీరో.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

    పూరీ జగన్మాథ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలపైనే కాకుండా దేశంలోని సమస్యలపై స్పందిస్తుంటారు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో పూరీ జగన్మాథ్ తనదైన శైలిలో సమస్యలపై విశ్లేషణ చేస్తుంటారు. తాజాగా ‘వెల్త్ మైగ్రేషన్’పై పూరి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ను తన ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేశాడు.

    వరల్డ్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 2015లో నాలుగువేల మంది బిలియనీర్స్ భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోయారని పూరి తెలిపాడు. అమెరికా.. ఆస్ట్రేలియా.. సింగపూర్ తదితర దేశాలకు వెళ్లిపోయి అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్నారని చెప్పాడు. ఇండియాలో పుట్టి.. ఇక్కడ సంపాదించి వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు అని మనం తిట్టుకుంటాం గానీ.. ఎందుకలా వెళ్లిపోతున్నారని ఆలోచించడం లేదన్నారు.

    Also Read: థియేటర్ల ఓపెనింగ్.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా?

    ఇండియాలో రోజురోజుకు సోమరిపోతుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. ధనవంతులు.. పేదవారి మధ్య అంతరం పెరిగిపోతుందని చెప్పాడు. పన్నుల వ్యవస్థ కూడా సక్రమంగా లేదని అందుకే చాలా మంది దేశం వదిలి వెళ్లిపోతున్నారు. కరోనాతో ఈ ఏడాది అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మనం ప్రస్తుతం రెట్టింపు కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే దుకాణం బంద్ ఐతది అంటూ తనదైన శైలిలో హెచ్చరిస్తూ ముగించాడు. ప్రస్తుతం పూరి జగన్మాథ్ విజయదేవరకొండతో ‘ఫైటర్’ మూవీ చేస్తున్నాడు.