https://oktelugu.com/

రజిని, అమితాబే చేస్తారు, ఇక మనమెంత – పూరి

‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’లో భాగంగా ఈ రోజు సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ ఏమిటంటే ‘ప్రాక్టీస్’. మరి పూరి మాటల్లోనే.. ‘బ్రూస్లీ ఒక మాట చెప్పాడు. నాకు పదివేల కిక్స్ తెలిసిన వాడంటే భ‌యం లేదు గానీ, ఒక కిక్‌ ని పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వాడు అంటే మాత్రం, నేను చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాను అని. ఎందుకంటే ఆ ఒక్క కిక్‌ నే వాడు ప్రాక్టీస్ […]

Written By: , Updated On : June 16, 2021 / 04:16 PM IST
Follow us on

Puri Jagannadh‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’లో భాగంగా ఈ రోజు సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ ఏమిటంటే ‘ప్రాక్టీస్’. మరి పూరి మాటల్లోనే.. ‘బ్రూస్లీ ఒక మాట చెప్పాడు. నాకు పదివేల కిక్స్ తెలిసిన వాడంటే భ‌యం లేదు గానీ, ఒక కిక్‌ ని పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వాడు అంటే మాత్రం, నేను చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాను అని. ఎందుకంటే ఆ ఒక్క కిక్‌ నే వాడు ప్రాక్టీస్ చేసి చేసి దానిలో వాడు మాస్ట‌ర్ అయి పోయి ఉంటాడు. అలాంటి వాడు కొడితే మ‌న కాలు విరిగిపోద్ది. అందుకే మ‌నకు ఏ ప‌ని తెలిస్తే, అందులో మాస్ట‌ర్ అయిపోవాలి’ అంటూ చేసే పని పై ఎంత పిచ్చి ఉండాలో క్లారిటీగా చెప్పుకొచ్చాడు పూరి.

ఈ క్రమంలో ఇంకా చెబుతూ.. ‘మనకు తెలిసిన పనిని ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాలి. దీన్నే సాధ‌న అంటారు. నువ్వు ఎంత పెద్ద సింగ‌ర్‌ వి అయినా రోజూ ప్రాక్టీస్ చేయ్‌. నువ్వు బాక్స‌ర్ అయితే రోజూ కిక్ బ్యాగ్‌ ని కొట్టు. నీకు బోలెడు నాలెడ్జ్ ఉండొచ్చు. ప్రాక్టీస్‌ లో పెట్ట‌క‌పోతే చెంప పగులుద్ది. కుంగ్ ఫూ టెక్నిక్స్ ఎన్ని తెలిసినా ప్రాక్టీస్ లేక‌పోతే, మనమే తన్నులు తినాల్సి వస్తోంది. నేను అమితాబ్ బ‌చ్చ‌న్ గారితో ప‌నిచేశాను. ఆయన గ్రేట్ యాక్ట‌ర్‌. కానీ మీకు తెలుసా ? ఆయన షూటింగ్ అయిపోగానే అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌రికి స్వ‌యంగా త‌నే వెళ్లి మ‌రుస‌టి రోజు సీన్ పేప‌ర్ తీసుకుని, ఉద‌యం లేవ‌గానే ఆ సీన్ ను ప్రాక్టీస్ చేసి సెట్ కి వస్తారు.

అంత ప్రాక్టీస్ చేసి వచ్చిన ఆ గ్రేట్ యాక్టర్, మ‌ళ్లీ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి అదే సీన్ పేప‌ర్‌ ఇచ్చి చదివించుకుంటారు. డైరెక్టర్ ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ కోరుకుంటున్నాడో అని అర్ధం చేసుకోవడానికి. పైగా ఆ సీన్‌లో త‌న‌తోపాటు ఎవ‌రెవ‌రు యాక్ట్ చేస్తున్నారో తెలుసుకుని, తానే వారి దగ్గరికి స్వయంగా వెళ్లి కలిసి సీన్ ప్రాక్టీస్ చేద్దామా అంటూ.. వాళ్లు చిన్న యాక్ట‌ర్ అయినా స‌రే, వాళ్లతో కలిసి సీన్ ప్రాక్టీస్ చేసేవారు. ఆ సమయంలో అవ‌త‌లి వాళ్ళు డైలాగ్ బెటర్ గా చెబితే, వారి దగ్గర నుండి నేర్చుకునేవారు.

అలాగే ఎదుటివారు డైలాగ్ ను చెప్పే విధానాన్ని గుర్తు పెట్టుకుని, ఫలానా రియాక్ష‌న్ ఇవ్వాలి అని ఆయన ముందే ఫిక్స్ అవుతారు. మామూలుగా ఏ యాక్ట‌ర్ కారావ్యాన్‌ నుండి దిగరు. కానీ, అమితాబ్ గారి గురించి విన్నారుగా. ఎంత ప్రాక్టీస్ చేస్తారో.. అందుకే ఆయ‌న అమితాబ్ బ‌చ్చ‌న్‌ అయ్యారు. ఆయ‌న‌తో పోలిస్తే ఇక మ‌నం ఎంత‌? ప‌నిలో ఉన్నా.. ప‌ని లేకపోయినా మీ పనిని సాధ‌న చేయండి. సిగ‌రెట్ విసిరినప్పుడు అది క‌రెక్టుగా వెళ్లి నోట్లో ప‌డాలి. అలా ప‌డితే నువ్వు ర‌జ‌నీకాంత్ వి అవుతావు’ అంటూ పూరి మరో పాఠం చెప్పారు.

YouTube video player