https://oktelugu.com/

నవ్వులో ఆనందం ఉంటే.. దానర్థం అదే – పూరి

‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసే క్రమంలో ఈ రోజు మరో సరికొత్త టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘సఫరింగ్‌’. దీని గురించి అందరికి తెలుసు. మరి పూరి మాటల్లోనే ‘సఫరింగ్‌’ గురించి విందాం. ‘మనందరికీ సఫరింగ్ అంటే భయం. మనం జీవితంలో అసలు బాధ పడకూడదు, కష్ట పడకూడదు అని కోరుకుంటాం. కానీ అది కుదరదు. జీవితంలో బాధ పడని వాడు ఎవ్వడూ ఉండడు. […]

Written By: , Updated On : June 14, 2021 / 06:58 PM IST
Follow us on

Puri Jagannadh‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసే క్రమంలో ఈ రోజు మరో సరికొత్త టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘సఫరింగ్‌’. దీని గురించి అందరికి తెలుసు. మరి పూరి మాటల్లోనే ‘సఫరింగ్‌’ గురించి విందాం. ‘మనందరికీ సఫరింగ్ అంటే భయం. మనం జీవితంలో అసలు బాధ పడకూడదు, కష్ట పడకూడదు అని కోరుకుంటాం. కానీ అది కుదరదు. జీవితంలో బాధ పడని వాడు ఎవ్వడూ ఉండడు. ప్రతి ఒక్కడూ ఎప్పుడో ఒకసారి సఫర్ అవ్వాల్సిందే.

మనం పుట్టిన వెంటనే ఏడుస్తాం, ఏడుస్తూనే ఊపిరి పీలుస్తాం. అలాగే ఊపిరి వదిలేయడానికి కూడా మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ, సఫరింగ్ అనేది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. మనం సఫరింగ్ ను మనస్పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. బాధలో కూడా అనుభవాన్ని పొందాలి. కాబట్టి, కష్టాలు పడండి, జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలే మనల్ని ఎంతో దృఢంగా మారుస్తాయి.

అలాగే గతాన్ని తలుచుకుని ఏడ్చే కార్యక్రమాన్ని వదిలేయండి. ఎప్పుడో జరిగిన దాన్ని తల్చుకుని ఇంకా ఏడుస్తున్నావంటే దాని అర్ధం నీకు ఇంకా బుద్ధి రాలేదు అని. కాబట్టి, గతంలో పడ్డ కష్టాలు గుర్తుకు వస్తే.. మన పెదవిలో నవ్వు రావాలి. నిజంగా ఆలోచిస్తే.. కష్టాల వల్ల మనలో ఒక గ్రేస్‌ వస్తుంది. కష్టాలు పడిన వాడి కళ్లల్లో ఎప్పుడూ ఒక మెరుపు ఉంటుంది. అందుకే కష్టాలను దైర్యంగా రిసీవ్ చేసుకోండి.

ఎందుకంటే.. ఎవరు బాధ పడకుండా, కష్టాలు పడకుండా చావరు గనుక. పైగా కష్టాలు మనకు మేలు చేస్తాయి కూడా. ఒక సాధారణ వ్యక్తి పగలపడి నవ్వినా మనకు ఏమి అనిపించదు. పెద్దగా వాడి నవ్వును ఎవరూ పట్టించుకోరు. కానీ, యుద్ధంలో పోరాడి వచ్చిన వ్యక్తి చిన్న చిరు నవ్వినా అది మనకు ఎంతో కాలం గుర్తు ఉండిపోతుంది.

నవ్వే ఆ ముఖంలో ఉండే మెరుపు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. ఆ నవ్వు ఎంతకాలమైనా మన మనసులో అలానే ఉండిపోతుంది. అందుకే, ఎదుటి వ్యక్తి నవ్వులో లోతైన ఆనందం ఉంటే.. దాని అర్థం అతను జీవితంలో దైర్యంగా ఎన్నో కష్టాలు పడ్డాడని’ అంటూ పూరి సఫరింగ్ గురించి సరికొత్త విషయాలు చెప్పుకొచ్చాడు.

YouTube video player