Puri Jagannath-Vijay Sethupathi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇప్పుడు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannad). ఆయన తీసిన సినిమాలన్నీ యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆ సినిమాకి కనెక్ట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటాయి. పూరి జగన్నాథ్ చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధిస్తూ స్టార్ హీరోలందరికీ మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే కొంతమంది హీరోలను స్టార్లుగా తనే మార్చాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కొంతవరకు ప్రేక్షకులను నిర్ష పరుస్తున్నప్పటికి ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మక్కల్ సెల్వన్ ‘విజయ్ సేతుపతి’ (Vijay Sethupathi) తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇంతకుముందు విజయ్ సేతుపతి మహారాజా అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి మరోసారి తను మెయిల్ లీడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
Also Read : ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆ హీరోయిన్ కు స్టార్ స్టేటస్ ను కట్టబెడుతున్నారా..?
అయితే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఇప్పటికి జనాల్లో విపరీతమైన ఆసక్తి అయితే ఉంటుంది.
ఆయన సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపించకపోయిన కూడా ఆయన డైలాగుల్లో ఏదో ఒక ఫిలాసఫీ అయితే దాగి ఉంటుంది. తద్వారా ఇప్పుడున్న యూత్ ఆయన సినిమాలోని డైలాగులకు కనెక్ట్ అయి అతను చెప్పే విషయాలను అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు పూరి జగన్నాధ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది.
విజయ్ సేతుపతి చేసిన సినిమాలు మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాయి. ప్రస్తుతం అతను పూరి జగన్నాధ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటేనే ఆ సినిమాలో ఏదో ఒక కొత్తదనం అయితే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మరి పూరి ఈ సినిమాతో భారీ కంబ్యాక్ ను ఇచ్చి మరోసారి స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే స్థాయికి ఎదుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : కీర్తి సురేష్ నుండి డబ్బులు లాక్కున్న ఐస్ క్రీం షాప్ ఓనర్..వీడియో వైరల్!