Big breaking News: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: డిసెంబర్ 1న పోలింగ్.. 4న కౌంటింగ్

హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేష్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ ప్రక్రియ చేపట్టేలా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి మంగళవారం షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. 20వ తేదీ నామినేషన్లకు చివరి రోజు అని తెలిపారు. 21న పరిశీలన ఉంటుందన్నారు. అలాగే 24న మధ్యాహ్నం 3 గంటల లోపే నామినేషన్ల ఉప సంహరణకు గడువు […]

Written By: Suresh, Updated On : November 17, 2020 10:59 am
Follow us on

హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేష్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ ప్రక్రియ చేపట్టేలా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి మంగళవారం షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. 20వ తేదీ నామినేషన్లకు చివరి రోజు అని తెలిపారు. 21న పరిశీలన ఉంటుందన్నారు. అలాగే 24న మధ్యాహ్నం 3 గంటల లోపే నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉందన్నారు. ఇక డిసెంబర్ 1న పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు   ఉంటుందని, 4 ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారని ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. మొత్తంగా 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని పార్థసారధి తెలిపారు.  జీహెచ్ఎంసీ  పరిధిలో మొత్తం 150 డివిజన్లలో అతిపెద్ద డివిజన్ మైలార్ దేవ్ పల్లి. ఈ డివిజన్ లో 79,290 మంది ఓటర్లు ఉన్నారు. అతి చిన్న డివిజన్ రామచంద్రాపూరం. ఈ డివిజన్ లో 27,997 ఓటర్లు ఉన్నారు. కాగా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఎన్నికల కమిషనర్ తెలిపారు. అయితే రిజర్వేషన్లు ప్రభుత్వానికి సంబంధించిన విషయమన్నారు.మరోవైపు పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలోనే ఉంటుందన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలకు నోటిఫికేషన్ వెలువడడంతో రాజకీయ సందడి నెలకొంది.