Homeఎంటర్టైన్మెంట్Puri Jagannath : సినిమాలకు గుడ్ బై చెప్పేసి సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన పూరి జగన్నాథ్

Puri Jagannath : సినిమాలకు గుడ్ బై చెప్పేసి సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన పూరి జగన్నాథ్

Puri Jagannath : తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త పుంతలు తొక్కించిన డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్.ఈయన సినిమాలోని హీరో క్యారెక్టర్స్ హీరోయిజమ్ కి పెట్టింది పేరులాగా ఉంటుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో ప్రారంభమైన పూరి జగన్నాథ్ కెరీర్, సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన పోకిరి సినిమాతో నెంబర్ 1 స్థానం కి ఎగబాకింది.అప్పట్లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా పూరి జగన్నాథ్ రికార్డ్స్ ని కొట్టడానికి చాలా కష్టపడేవాడు.అలాంటి పూరి జగన్నాథ్ తో ఇప్పుడు హీరోలు సినిమాలు చెయ్యడానికే వణికిపోతున్నారు.

ఆయన లేటెస్ట్ చిత్రం లైగర్ ఫలితం అలాంటిది మరీ.పూరి జగన్నాథ్ కి ఫ్లాప్స్,డిజాస్టర్స్ కొత్తేమి కాదు.కానీ ఈ లైగర్ సినిమా అనేది ఆయన దర్శకత్వ ప్రతిభని ప్రశ్నించేలా చేసింది.గతం లో ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ, అది జనాలు వివిధ కోణాల్లో చూడడం వాళ్ళ డివైడ్ రెస్పాన్స్ వచ్చిందే తప్ప డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ ఫెయిల్ అవ్వలేదు.

కానీ లైగర్ సినిమా తో ఆయన డైరెక్షన్ లో ఫెయిల్ అవ్వడం కాదు, ఏకంగా డిజాస్టర్ అయ్యాడు.అసలు ఈ సినిమాకి డైరెక్టర్ నిజంగా పూరి జగన్నాథ్ యేనా అనే అనుమానం అందరిలో కలిగించేలా చేసాడు ఈ చిత్రంతో.దీనితో ఆయన దర్సకత్వం లో నటించడానికి స్టార్ హీరోల సంగతి పక్కన పెట్టు, చిన్న హీరోలు కూడా భయపడిపోతున్నారు.రీసెంట్ గానే చిరంజీవి తో పూరి జగన్నాథ్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి, కానీ ఫైనల్ స్టోరీ డిస్కషన్స్ లో చిరంజీవికి నచ్చినట్టు లేదు, అందుకే ఇక సినిమాలకు దర్శకత్వం వహించే బాధ్యత నుండి పూర్తిగా తప్పుకొని, నటుడిగా ఇండస్ట్రీ లో కొనసాగిపోవడానికి సిద్ధం అవుతున్నాడు పూరి జగన్నాథ్.

గత ఏడాదే ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపుని తెచ్చుకున్న పూరి జగన్నాథ్, ఇక నుండి కూడా అలాంటి రోల్స్ తోనే ముందుకు తన కెరీర్ ని సాగించాలని చూస్తున్నాడట.చూడాలి మరి పూరి జగన్నాథ్ కి ఎలాంటి రోల్స్ వస్తాయో అనేది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version