
Jr NTR : స్టార్ హీరోల మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉన్నా, అభిమానుల మధ్య మాత్రం ఆ రేంజ్ రాపో ఉండడం లేదు.మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఎల్లప్పుడూ ఒకరిని ఒకరు పోల్చి చూస్తూ కొట్టుకుంటూ ఉంటారు.అందుకే స్టార్ హీరోలతో మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలు సాహసం చెయ్యరు.కానీ రాజమౌళి ఒక అడుగు ముందుకేసి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి నేటి తరం మాస్ హీరోలను పెట్టి #RRR అనే సినిమా చేసాడు.
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది, బాక్స్ ఆఫీస్ పరంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ ని గెలుచుకుంటూ సంచలనం సృష్టించింది.ఆస్కార్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయినా ఈ సినిమాకి ఆస్కార్ వస్తుందో నేడో అనే విషయం ఈ ఆదివారం రోజు తెలియనుంది.
అయితే రామ్ చరణ్ గత వారం రోజుల నుండి అమెరికన్ పాపులర్ మీడియా చానెల్స్ కి వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ #RRR మూవీ ని ప్రమోట్ చేస్తున్నాడు.రీసెంట్ గా ఆయన ‘టాక్ ఈజీ’ అనే పాపులర్ పోడ్ క్యాస్ట్ ఛానల్ లో పాల్గొన్నాడు.ఈ ఛానల్ లో సామ్ అనే విలేఖరి రామ్ చరణ్ తో కాసేపు చిట్ చాట్ చేసాడు.ఈ చాట్ సెషన్ లో రామ్ చరణ్ అతి త్వరలోనే తానూ ఒక హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాను అనే విషయాన్నీ తెలియజేసాడు.దీనితో పాటుగా ఆయన మాట మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ ని సైడ్ యాక్టర్ అని సంబోధించడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.
అసలే ఇప్పుడు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా లో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు ఉన్నాయి.ఇప్పుడు ఈ సంఘటన జరగడం తో వాళ్ళిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి.కనీసం ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత అయినా వీళ్ళు కలిసికట్టు గా యూనిటీ పాటిస్తారని విశ్లేషకులు ఆశిస్తున్నారు.