https://oktelugu.com/

Puri Jagannath : ఆటోఫజీ కి అర్ధం చెప్పిన పూరి..? ఉపవాసం ఉండటం వల్ల బాడీ లో ఎలాంటి మార్పులు వస్తాయి…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నప్పటికి పూరి జగన్నాధ్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడమే కాకుండా ఆయనకంటూ ఒక మార్కెట్ ను కూడా ఏర్పాటు చేసుకొని మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : January 7, 2025 / 10:10 PM IST

    Puri Jagannath

    Follow us on

    Puri Jagannath : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్… ఈయన చేసిన సినిమాలు ఒకప్పుడు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగాయి. ఇక పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈయన తెలుగులో ఉన్న హీరోలందరికి మంచి విజయాలను అందించాడు… ప్రస్తుతం గత కొద్దిరోజుల నుంచి ‘పూరి మ్యూజింగ్స్’ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రేక్షకులకు తన అభిమానులకు ఏదో ఒక విషయం చెబుతూ మోటివేట్ చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మంచి ఫుడ్, వ్యాయామం, చక్కటి స్నానం చేయడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు ఏంటి? దానివల్ల మనం ఎలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఆటోఫజీ అంటే ఏంటి దానికి అర్థం చెప్పే ప్రయత్నం అయితే చేశాడు..మరి ఆయన ఏం చెప్పాడు దానికి సంబంధించిన విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    నిజానికి ‘ ఆటోఫజీ ‘ అనే పదం గ్రీకు నుంచి వచ్చింది… ఆటో అంటే ‘సెల్ఫ్’ , ఫజి అంటే ‘ తినడం ‘…ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ ఈటింగ్…ఇక మన శరీరంలో ఉన్న పనికిరాని దెబ్బతిన్న కణాలను శరీరమే తినేస్తుంది. ఆటోఫజీ వల్ల శరీరానికి హాని కలిగించే వాటిని బయటికి పంపించేసి శరీరం మొత్తం రీసైక్లింగ్ చేస్తుంది. దీనివల్ల బడిలో ఉన్న పనికి రాని ప్రోటీన్లు వెళ్ళిపోయి శరీరం ఇంకా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది…

    ఇక ఆటో ఫజీ వల్ల మెటబాలిజం పెరిగి వృద్ధాప్యం తొందరగా రాకుండా కాపాడుతుంది. అలాగే క్యాన్సర్ లాంటి రోగాన్ని సైతం రాకుండా అదుపు చేస్తుంది… ఇక ఈ ఆటో ఫజీ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు వ్యాయామం చేసినప్పుడు ఆటోమేటిగ్గా బాడీ ఆటోఫజీ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనిషి యొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది. అందుకే ఉపవాసాలు ఉండడం చాలా ముఖ్యం…ఇక నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒక దేవుడు పేరు చెప్పి ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నం చేయండి…

    ఇక జపాన్ కి చెందిన యశ్నోరి అనే బయోలాజిస్ట్ మొదటి సారిగా ఈ ఆటోఫజీ గురించి కనుక్కున్నాడు…అతనికి ‘నోబెల్ బహుమతి’ కూడా వచ్చింది… అందుకే ఇక మీదట నుంచి అందరూ ఉపవాసాలు చేయండి, వ్యాయయం చేయండి, చక్కటి స్నానం చేసి ఆటోఫజీ ని మెరుగుపరుచుకోండి అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…