Sankranthi 2025: దక్షిణ భారత దేశంలో(India) ఎక్కువగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి(Sankranthi) అతిపెద్దది. ఎంత దూరాన ఉన్నా కూడా సంక్రాంతి పండగకు అందరూ ఇళ్లు చేరుకుంటారు. పండుగ వాతావరణంతో ఇళ్లు నిండిపోతాయి. హిందూ మతంలో ఈ మకర సంక్రాంతి(Sankranthi) పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతీ ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులతో, ఆట పాటలతో ఇంటిల్లిపాది సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే నెల రోజుల నుంచే అందరూ కూడా షాపింగ్(Shopping) అంటూ మొదలు పెడతారు. ఎన్ని పనులు ఉన్నా కూడా సంక్రాంతికి తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో(Family Members) ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ సంక్రాంతి పండుగ ప్రతీ ఏడాది జనవరి నెలలో 12 నుంచి 15వ తేదీల మధ్యలో వస్తుంది. అయితే ఈ ఏడాది మకర సంక్రాంతి(Sankranthi) ఏ రోజు జరుపుకోవాలని కొందరు సందేహ పడుతున్నారు. జనవరి 13వ తేదీనా లేకపోతే జనవరి 14వ తేదీ జరుపుకోవాలా? అని చాలా మంది ఇప్పటికీ సంకోచంలో ఉన్నారు. మరి ఈ సంక్రాంతి పండుగను జనవరి 13న లేకపోతే 14న జరుపుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
మకర సంక్రాంతి పండగను ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పండుగలు రెండు తిథుల్లో వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అయితే ఈ ఏడాది జనవరి 13 లేదా 14 ఏ తేదీల్లో మకర సంక్రాంతిని జరుపుకోవాలో తెలియక కొందరు సందేహ పడుతున్నారు. సూర్యుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మకర సంక్రాంతి పండుగను జనవరి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి పండుగ జనవరి14వ తేదీన ఉదయం 9.03 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.46 గంటలకు ముగుస్తుంది. అయితే జనవరి 14వ తేదీన ఉదయం 9.03 గంటల నుంచి 10.04 గంటల వరకు మకర సంక్రాంతి మహాపుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో పూజలు నిర్వహించి, దానం చేయడం వల్ల ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
సంక్రాంతి పండుగ రోజు చాలా మంది పుణ్య నదుల్లో స్నానం చేస్తుంటారు. గంగా, యమున, గోదావరి వంటి పుణ్య నదుల్లో స్నానం చేస్తుంటారు. అయితే ఈ నదుల్లో బ్రహ్మ ముహూర్తంలో కానీ, సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల లోపల అయిన చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఈ నదుల్లో స్నానం చేసిన తర్వాత తప్పకుండా దానం చేయాలి. ముఖ్యంగా బెల్లం, నువ్వులు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఇలా దానం చేయడం వల్ల పాపాలు అన్ని తొలగిపోతాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.