Puri Jagannadh and Vijay Sethupathi : ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇండస్ట్రీలో మంచి గుర్తింపైతే లభిస్తుంది. ఇక కొంతమంది దర్శకులు సైతం హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇండస్ట్రీలో చాలా రోజులపాటు తమ స్టార్ డమ్ ను కొనసాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ సైతం ప్లాపుల్లో ఉన్నప్పటికి ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం విశేషం.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)…ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అని ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇంతకుముందు ఆయన చేసిన లైగర్ (Liger), డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమాలు వరుసగా డిజాస్టర్లు గా మారడంతో ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలు మంచి విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని ఒక యాంగిల్ లో చూపిస్తే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక యాంగిల్ లో చూపించడానికి రెడీ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో బెగ్గర్ అనే సినిమాని చేయబోతున్నాడు. అయితే విజయ్ సేతుపతి తో సినిమా చేయడం ఎందుకు తెలుగులో అతన్ని మించిన పర్ఫామెన్స్ చేసే నటులు ఉన్నారు కదా వాళ్లతో సినిమా చేస్తే సరిపోతుంది కదా అనే డౌట్ అందరికీ వస్తుంది.
Also Read : పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!
కానీ పూరి ఈ కథని దాదాపు ఇద్దరు ముగ్గురు హీరోలకు తెలియజేశారట. వాళ్ళు మాత్రం దానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అయితే స్టార్ డమ్ వైజ్ చూసుకున్న, యాక్టింగ్ పరంగా చూసుకున్న ఆయనకి మంచి క్రేజ్ అయితే ఉంది. కాబట్టి. క్రేజ్ ను కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన లాంటి హీరో అయితేనే తన సినిమాకి న్యాయం చేయగలడనే ఉద్దేశ్యంతో పూరి జగన్నాథ్ అతన్ని సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పూరి జగన్నాథ్ చేయబోతున్న సినిమాతో విజయ్ సేతుపతి నటుడిగా మరొక మెట్టు పైకి ఎదగబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
మరి విజయ్ కూడా ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీని కాన్సెప్ట్ ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?