Gymkhana Movie Review: సినిమా ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో మలయాళం సినిమాలకి చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆ సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోయింది… ‘జింఖానా’ (zinkaana) అనే మలయాళం సినిమా ని 2 వారాల క్రితమే అక్కడ రిలీజ్ చేశారు. ఆ సినిమా అక్కడ మంచి సక్సెస్ ను సాధించింది. దాంతో ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: పూరి కి విజయ్ సేతుపతి కాకుండా తెలుగు ఇంకేహీరో దొరకలేదా..?
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక స్టూడెంట్ బ్యాచ్ ఇంటర్ ఫెయిల్ అవుతారు. ఇక ఇంజనీరింగ్ లోకి వెళ్లాలంటే స్పోర్ట్స్ కోటాను సంపాదించాలనే ఉద్దేశ్యంతో బాక్సింగ్ నేర్చుకోవాలని జింఖానా అనే ఒక బాక్సింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు. మరి అక్కడి నుంచి వాళ్ళ కెరియర్ ఎలా ముందుకు సాగింది. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని మొదటినుంచి చివరి వరకు దర్శకుడు ఒక ఎంటర్ టైనింగ్ మూడ్ లో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా మొత్తం బాక్సింగ్ కోసమే ఉంటుంది అనే అంచనాలు పెట్టుకొని ప్రేక్షకులు థియేటర్ కి వస్తే మాత్రం తీవ్రంగా నిరాశపడతారనే చెప్పాలి. బాక్సింగ్ అనేది ఒక సబ్ ప్లాట్ గా మాత్రమే సెట్ చేసి పెట్టారు. ఇక ఈ సినిమా మొత్తాన్ని ఎంటర్ టైనింగ్ గా తీసుకెళ్తూ ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టించకుండా మంచి స్క్రీన్ ప్లే టెక్నిక్స్ వాడుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు.
ఇక హీరో అండ్ బ్యాచ్ చేసే కామెడీ గాని వాళ్ళు చేసే చేష్టలు గాని ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు రొటీన్ గా అనిపిస్తూ ఉంటాయి. మనం ఇంతకుముందు ఈ సీన్లు వేరే సినిమాలో చూశాం కదా అని అనిపిస్తూ ఉంటాయి. అవి ప్రేక్షకుడికి కొద్దిగా బోర్ కలిగించే అవకాశం అయితే ఉంది. సినిమా ఫ్లో మాత్రం చూసుకుంటే ఎక్కడ తగ్గకుండా సినిమాకి భారీ హైపిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇక సినిమా ఎండింగ్ లో చాలా సింపుల్ గా క్లోజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ క్లైమాక్స్ లో చ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు వాళ్లకి తెలుగులో మంచి ఆదరణ అయితే దక్కుతుంది.
ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా వరకు ప్లస్ అయింది. డబ్బింగ్ సినిమాకి మ్యూజిక్ అంటే సాంగ్స్ అంత పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవు. కానీ ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం ప్రేక్షకులకు సినిమా చూస్తున్నంత సేపు బాగా నచ్చుతాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికొస్తే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన నస్లిన్ గాఫర్ చేసిన యాక్టింగ్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ఇక ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి.
ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకుంటూ ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకపాత్ర వహించాడు. ఆయన నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. అలాగే ఇకమీదట ఆయనకి తెలుగులో కూడా భారీ అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి. ఇక లక్మన్ అవరన్, బేబీ జీన్ లాంటి నటులు సైతం సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ బాగుంది..అలాగే అద్భుతమైన విజువల్స్ ను అందించడంలో సినిమాటోగ్రాఫర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ ఫైట్ లో విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయి. కెమెరా ను ఒక దగ్గర స్టిక్ చేయకుండా 360 డిగ్రీలు తిప్పుతూ షాట్స్ ను ఎలివేట్ చేసే ప్రయత్నంలో సినిమాటోగ్రాఫర్ చాలా గొప్ప ఔట్ పుట్ అందించాడనే చెప్పాలి…ఇక ఎడిటర్ కూడా చాలా అద్భుతమైన ఎడిటింగ్ ప్రతిభను చూపించాడు…
ప్లస్ పాయింట్స్
కథ
ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ కొంచెం డల్ అయింది
కామెడీ అక్కడక్కడ సెట్ అవ్వలేదు…
రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.5/5