Lokesh Kanagaraj : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నప్పటికి అందులో లోకేష్ కనకరాజుకి చాలా ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి ఆయనకు మంచి గుర్తింపురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. అందుకే లోకేష్ కనకరాజు తో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) తో కూలీ (Cooli) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఇప్పటినుంచి స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన అమీర్ ఖాన్ (Ameer Khan) ని కలిసి ఒక కథను కూడా చెప్పారట. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. అయితే అమీర్ ఖాన్ అయితేనే ఈ కథకి న్యాయం చేయగలరనే ఉద్దేశ్యంతో అతనికి ఈ కథను వినిపించాడు. మరి మొత్తానికైతే అమీర్ ఖాన్ కూడా ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజు ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : నెల్సన్ vs లోకేష్ కనకరాజ్ ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ తో సినిమా చేసేది ఎవరు..?
ఇక మొత్తానికైతే లోకేష్ కనకరాజు లాంటి దర్శకుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఈ సినిమాతో ఇటు లోకేష్ కనకరాజు అటు అమీర్ ఖాన్ ఇద్దరు కూడా భారీ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్లిద్దరూ కూడా భారీ ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకుంటూ ముందుకు సాగితే మాత్రం వాళ్ళిద్దరికి చాలా బాగా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. ఇప్పటివరకు అమీర్ ఖాన్ ఏ సినిమాకి కూడా కమిట్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలవాలి అంటే రొటీన్ కథలతో సినిమాలు చేయకూడదనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక తెలుగు హీరోల నుంచి ఎదురయ్యే పోటీని కూడా తట్టుకోని నిలబడాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తేనే బాగుంటుంది అనే ధోరణిలో ఆయన చాలావరకు సినిమా కథలను రిజెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి లోకేష్ కనకరాజు చెప్పిన కథ మాత్రం తనకి విభత్సంగా నచ్చడంతో ఇప్పుడు ఆయన ఈ సినిమాని చేయడానికి సిద్ధమవుతున్నాడు.
Also Read : ఇక సెలవు అంటూ రజినీకాంత్ ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్!