Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లో హీరోగా అంతగా సక్సెస్ సాధించనప్పటికి శివ సినిమాతో ఒక్కసారిగా ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో నాగార్జున రెండు సినిమాలను చేశాడు. అందులో ‘సూపర్ ‘ సినిమా ఫ్లాప్ అవ్వగా, ‘శివమణి ‘ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ముచ్చటగా మూడోసారి పూరి నాగార్జునతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి పూరి వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు అయినప్పటికీ తన తర్వాత సినిమాను నాగార్జునతో చేయాలనే ప్లానింగ్ లో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక పూరి ఒక సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటాయి. ఇక నాగార్జునకి కూడా పూరి వర్కింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. అందుకే పూరి డైరెక్షన్ లో ఇంతకు ముందే రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక పర్సనల్ గా కూడా పూరి అంటే నాగార్జునకి ఇష్టమని ఆయన చాలాసార్లు చెప్పారు. ఇక ఇదిలా ఉంటే పూరి చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా సక్సెస్ అయితే నాగార్జునతో సినిమా చేస్తాడు. లేకపోతే మాత్రం నాగార్జున అవకాశం ఇస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక నిజానికి అయితే పూరి జగన్నాథ్ అనుకుంటే నాగార్జున ఈజీగా డేట్స్ అయితే ఇస్తాడు. కానీ సక్సెస్ తో నాగార్జున దగ్గరికి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశ్యంలోనే పూరి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించిన టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ చాలా అద్భుతంగా ఉండడంతో పాటు పూరి మార్క్ సీన్స్ కూడా ఈ సినిమాలో చాలానే ఉన్నట్టుగా ఈ టీజర్ ను చూస్తే మనకు అర్థం అవుతుంది. చూడాలి మరి వీళ్ళ కాంబో లో వచ్చే సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది…