Puri Jagannadh proverb : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)… ఈయన మంచి సినిమాలను తీయడమే కాకుండా సమయం దొరికిన ప్రతిసారి తన అభిమానులను ఉద్దేశిస్తూ వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనే ఒక లైఫ్ స్టైల్ ని నేర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. యూట్యూబ్ లో పూరి మ్యూజిక్స్ ద్వారా వాటిని రిలీజ్ చేస్తూ తన అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు.ఇప్పుడు ‘తాజాగా టీనీ లివింగ్ థింగ్స్’ అనే దాని మీద మాట్లాడారు…
మన కంటికి కనిపించని ఎన్నో జీవాలు మన శరీరం మీద ఉంటాయి వాటిని ‘మైక్రోబ్స్’ (Maicrobs) అంటారు… మానవ శరీరం ఎన్నో మిలియన్ల జీవరాశులకు ఇల్లుగా మారింది. ముక్కులో, నోట్లో, జుట్టులో శరీరం పైన భాగాల్లో జీవాలు నివసిస్తూ ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు. మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తప్ప అవి మన శరీరం మీద ఉన్నట్టుగా మనకు కనిపించవు. వాటిని చూస్తే నిజంగా మనం ఆశ్చర్యపోతాం… ఎందుకంటే ఇన్ని జీవాలు మన బాడీ మీద బతుకుతున్నాయా అనే ఒక ఆశ్చర్యానికి గురి అవుతాం…
బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి జీవాలు మన శరీరం మీద ఉంటాయి. వీటివల్ల చెడు కలిగించే బ్యాక్టీరియా వచ్చినప్పుడు వాటిని అవే చంపేస్తూ మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తాయి.విటమిన్స్, ప్రోటీన్స్ ఉత్పత్తి చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి…మన శరీరం మొత్తం మీద 100 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉంటాయి… వాటిని కనక బరువు తూస్తే 2 కిలోల వెయిట్ ఉంటుంది.
Also Read : పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!
పల్లెటూరులో బతికే వాళ్ళు మైక్రోబ్స్ ను ఎక్కువగా ఇబ్బంది పెట్టరు…అదే సిటీ లో ఉండేవాళ్ళు పరిశుభ్రత పేరుతో రోజుకు పది సార్లు సబ్బుతో చేతులు కడుగుతూ, శానిటైజర్స్ రాసుకోవడం వల్ల మైక్రోబ్స్ ను దూరం చేసుకుంటున్నారు.అందుకే వీలైనంతవరకు విలేజ్ లో బతకడానికి ఇంట్రెస్ట్ చూపించండి. కుక్కలు, పిల్లలు, కోళ్లు, గొర్రెలు, గుర్రాల మధ్య బతికే వాళ్లలో మైక్రోబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి… వాళ్ళు మైక్రోబ్స్ ను ఎక్కువగా ఇబ్బంది పెట్టరు…అందుకే సిటీ లో ఉన్నవాళ్ళైన సరే కుక్కలను, పిల్లలను పెంచుకోండి. వీలైనంత వరకు వాటితో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించండి…
శానిటైజర్స్, టిష్యూస్ ఎక్కువగా వాడేవాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు…మీ పిల్లల్ని సైతం మట్టిలో ఆడుకోనివ్వండి, వర్షం లో తడవనివ్వండి…ఎంజాయ్ చేయనివ్వండి…ఇలా చేసినప్పుడు మాత్రమే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు… మన లైఫ్ స్టైల్ మారింది కాబట్టే ప్రతి జనరేషన్ వీక్ అవుతూ వస్తున్నాయి…మన నానమ్మ ఉన్నంత బలంగా మన అమ్మ లేదు. మన అమ్మ ఉన్నంత స్ట్రాంగ్ గా మనం ఉండలేకపోతున్నాం… ఇక మన తర్వాత జనరేషన్లు సైతం మనంత స్ట్రాంగ్ గా ఉండరు…